తల్లి దిగంతాలకు.. తండ్రి జైలుకి | - | Sakshi
Sakshi News home page

తల్లి దిగంతాలకు.. తండ్రి జైలుకి

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

జి.సిగడాం: అభం శుభం తెలియని ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. తండ్రి వ్యసనాలకు బానిస కావడంతో తల్లి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసు లో పిల్లల తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు. ఆనందపురం గ్రామానికి చెందిన కిమిడి రాజేశ్వరి(26), శ్యామలరావుకు హన్విక(4), జస్విస(18 నెలలు) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తల్లి మృతి చెందడంతో ఆ చిన్నారులు తల్లి కోసం అమ్మ కావాలి, అమ్మ ఎక్కడకి వెళ్లింది అంటూ దీనంగా చూస్తున్నారు. ఈ చిన్నారులను చూ సిన వారంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. తండ్రి కిమిడి శ్యామలరావు విశాఖపట్నంలో పోలీస్‌ బ్యారక్స్‌ ఎంటీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను వ్యసనాలకు బానిసై రాజేశ్వరి దగ్గర ఉన్న బంగారం తీసు కుని ఇష్టానుసారం బెట్టింగ్‌లు చేయడంతో ఆమె విసిగిపోయి ఉరి వేసుకున్నారు. చివరకు ఈ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.

Advertisement
 
Advertisement
Advertisement