కొత్తూరు: కార్పోరేట్ ఆస్పత్రులు అందిస్తున్న సేవలు కంటే దీటుగా.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందివ్వాలన్నదే రెడ్డీస్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సత్తి అన్నారు. మండలంలోని మూరుమూలలో ఉన్న కురిగాం పీహెచ్‌సీని రెడ్డీస్ ఫౌండేషన్ నిధులతో ఆధునీకరించారు. పీహెచ్‌సీని డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి పెద్దిన ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడారు. అధునాతన యంత్రాలను సమకూర్చామన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ల్యాబ్, ఫార్మసీ, పలు వార్డులు, ల్యాబరేటరీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇంతవరకు 24 పీహెచ్‌సీలను ఆధునీకరించామన్నారు. ఈఓ బుజ్జిబాబు, ఫౌండేషన్ సిబ్బంది సురేష్, నవీన్, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.


