పలాసలో మాట్లాడుతున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు
రణస్థలం: లావేరు మండలం కలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి అఖిల (21) అనే వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. లావేరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిలకు భర్త సురేష్‌కు మధ్య ఇటీవల మనస్ఫర్థలు తలెత్తాయి. భర్త సరిగా మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన అఖిల ఈ నెల 23న రాత్రి 11 గంటల సమయంలో క్షణికావేశంలో గడ్డి మందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరికి 2022లో వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె స్వగ్రామం రణస్థలం మండలం పాతర్లపల్లి పంచాయతీ సూరంపేట. మృతురాలి తండ్రి యందవ అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం తెలిపారు. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, స్కిల్ దునియా, ప్రెస్‌మీన్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్, నాగార్జున అగ్రికెమ్, కాన్సెంట్రిక్స్ ఫార్మా, పీఎంజే జ్యూయలరీ, జాయ్ అలుక్కాస్, డెక్కన్ కెమికల్, ఐ స్మార్ట్ సొల్యూషన్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని 500పైగా ఉద్యోగాలు కల్పిస్తాయని వివరించారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసిటీ నెల్లూరు, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికా రి ఉరిటి సాయికుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ నంబర్, బయోడేటా, ఆధార్, విద్యార్హతల ఒరిజినల్, జెరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫొ టోతో కలిసి ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా ప్రాంగణానికి హాజరుకావాలని, వివరాలకు 95509 67353 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


