పోర్టు బహిరంగ సభ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

పోర్టు బహిరంగ సభ విజయవంతం చేయండి

Mar 25 2026 7:20 AM | Updated on Mar 25 2026 7:20 AM

సంతబొమ్మాళి: నౌపడ మూడు రోడ్లు జంక్షన్‌ వద్ద ఈ నెల 30న జరిగే మూలపేట పోర్టు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ కోరారు. మంగళవారం నౌపడ మూడురోడ్లు జంక్షన్‌ వద్ద స్థలం లెవలింగ్‌ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మూలపేట పోర్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మిగిలిన వారిని విస్మరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. పార్టీ తరఫున ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టు, పరిసర ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు పిలక రవికుమార్‌రెడ్డి, చిన్ని జోగారావు యాదవ్‌, బడ్డ రాజేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement