కొత్తూరు: గొట్టిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులే తోటి విద్యార్థులకు వడ్డించారు. విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించ కూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పాఠశాల వార్డెన్ అప్పన్నమ్మ వద్ద ప్రస్తావించగా కమాటి అనారోగ్యం వల్లత హాజరు కాలేదని, కుక్ ఒక్కరే ఉన్నందున విద్యార్థులు వడ్డించినుట్ల చెప్పారు.
యురేకా సైన్స్ ఎక్స్‌పో
ఫలితాలు విడుదల
శ్రీకాకుళం: యురేకా సైన్స్ ఎక్స్‌పో–2026 రాష్ట్ర, జిల్లా స్థాయి ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.లక్ష్మణరావు, తవ్వా సురేష్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పర్యావరణం సుస్థిర అభివృద్ధికి సంబంధించి పైడి భీమవరం, ఇప్పిలి హైస్కూళ్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పైడి భీమవరం, కొల్లిపాడు హైస్కూల్ తొలి రెండు స్థానాలు సాధించాయి. మూఢ నమ్మకాలు–శాసీ్త్రయ దృక్పథం అంశంలో జర్జంగి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొందారు. ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఆక్స్‌ఫర్డ్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తామని గిరిధర్ తెలిపారు.
సమగ్ర చైతన్యయాత్ర ప్రారంభం
ఇచ్ఛాపురం: రాష్ట్రంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమ సాధనకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర చైతన్య, రాష్ట్ర సర్వే యాత్రను చేపట్టినట్లు రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమగ్ర చైతన్య రాష్ట్ర సర్వే యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో పర్యటించి ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై.శంకర్‌రావు, ఉపాధ్యక్షుడు కె.పాల్‌రాజు, కార్యదర్శి బి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి, కోశాధికారి ఎం.శ్రీధర్, స్వేచ్ఛావతి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు రంగాల శ్రీనివాసరావు, కార్యదర్శి చిలకలపూడి కృష్ణారావు, ధర్మసాహు, దానేష్‌రెడ్డి, కాయశ్రీను, దుదిష్టి, కె.మణి పాల్గొన్నారు.
ఆదిత్యలో సావి–3 సినిమా పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సావి–3 సినిమా పోస్టర్‌ను డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీలక్ష్మి కృష్ణ ఫిల్మ్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ కృష్ణమాయ, నిర్మాత విజయ్ తదితరులు తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో నాలుగు రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నటులు సామ్రాట్‌రెడ్డి, లిఖిత, డిమాన్ పవన్, టెంపర్ వంశీ, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అలుమ్ని ఇన్‌చార్జి డి.యుగంధర్, శాక్ ఇన్‌చార్జి సురేష్, ఎస్టేట్ మేనేజర్ పిరియా రమేష్, డీన్ డి.విష్ణుమూర్తి పాల్గొన్నారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలోని ఓ గ్రామంలో తోటలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామపెద్దల వద్ద పంచాయితీ జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
యాత్రలో పాల్గొన్న ఎలక్ట్రికల్ యూనియన్ ప్రతినిధులు


