ఆమదాలవలస: శ్రీకాకు ళం రోడ్ (ఆమదాలవల స) రైల్వేస్టేషన్‌లో బుధవా రం ఉదయం ఫలక్‌నుమా రైలు కింద పడి యువకుడు మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, మిగ తా ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పా రు. ఆచూకీ తెలిసిన వారు 9493474582 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకు ళం రిమ్స్‌కి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవం, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా పల్లిసారధి గ్రామంలో ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు ఉత్తరాంధ్ర ఆహ్వానిత నాటక కళాపరిషత్ పోటీలు నిర్వహించనున్న ట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, జన జాగృతి అధ్యక్షుడు కుమార్ నాయక్ తెలిపారు. పల్లిసారధిలో బుధవారం వారు మాట్లాడుతూ .. శ్రీరామాలయ కమిటీ, నాటక పరిషత్ కమిటీల ఆధ్వర్యంలో ‘కళ కళ కోసం కాదు–కళ ప్రజా చైతన్య కోసం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.


