సారవకోట: మండలంలో రబీలో సాగు చేసిన వరి పంట చేతికి రావడంతో రైతులు వరి కోతలు చేపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రబీ సీజన్‌లో 3 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో ప్రస్తుతం అంగూరు, అడ్డపనస, సారవకోట గ్రామాలలో వరి కోతలు చేపట్టి ధాన్యంను రోడ్లపై ఆరబెడుతున్నారు.
‘గ్రామ పెద్దలు చట్టాలను గౌరవించాలి’
రణస్థలం: ప్రజలు, ప్రజా ప్రతినిధులు చట్ట పరిధిలో సమస్యలను కోర్టు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేయడం ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. మండలంలోని కొండములగాం గ్రామంలో ఇటీవల కొన్ని కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేసి దండోరా వేయడం అనే వివాదంపై ఆ గ్రామంలో అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కు టుంబాలు, వ్యక్తుల గౌరవాలకు భంగం కలిగే లా చర్యలు చేపట్టరాదని, అలా చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.


