పారదర్శక పరిష్కారం ఉండాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పారదర్శక పరిష్కారం ఉండాలి : ఎస్పీ

Mar 25 2026 6:52 AM | Updated on Mar 25 2026 6:52 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో స్వీకరించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా పరిష్కారం చూపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలన, పోలీసు సిబ్బందికి సంబంధించి అన్ని అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–ఆఫీస్‌ విధానం ద్వారా జరగాలని, ఎస్‌ఐల పనితీరును డీఎస్పీ, సీఐలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విజుబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాల్లో నిత్యం సందర్శించి ప్రజలతో మమేకమవ్వాలని, నారీశక్తి–సంకల్పం పేరిట మహిళలు, బాలికల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్‌ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. బాణసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి నియమ నిబంధనలు, అనుమతులు, లైసెన్సులను పరిశీలించాలన్నారు. సకాలంలో కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్లను తక్షణమే అమలు చేయాలన్నారు. హెల్మెట్‌ ధారణ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమణ, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, గోవిందరావు, సీఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement