శ్రీకాకుళం : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు మంగళవారం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తు న్నామని తెలిపారు. జిల్లాలో 2.0 మిషన్లు, టీబీ నాట్ మిషన్లు ఉన్నాయని ఈ వందరోజుల కార్యక్రమంలో భాగంగా 77 పంచాయతీలను 1000 మంది పాపులేషన్ లెక్కన తీసుకొని ఒకటి కంటే తక్కువ ఉన్న పంచాయతీలను టీబీ ముక్త పంచాయతీలుగా ఒకటి లేక ఎక్కువ కేసులు ఉన్న పంచాయతీని సిల్వర్ పంచాయతీగా ఒకటి లేక సున్నా ఉన్న పంచాయతీలను గోల్డ్ పంచాయతీలుగా నిర్ణయించామన్నారు. టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.


