ఇరువర్గాల వాగ్వాదం | - | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల వాగ్వాదం

Mar 11 2026 8:59 AM | Updated on Mar 11 2026 8:59 AM

బూర్జ : చీడివలస గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎదుటే గ్రామస్తులు రెండు వర్గాలుగా వీడి వాగ్వాదానికి దిగారు. గ్రామంలో శ్మశానవాటికకు సరైన రహదారి లేదని, యాదవులకు పట్టాలు ఇవ్వడం లేదని, రోడ్లు వెడల్పు లేవని, డ్రైనేజీలు బాగు చేయడం లేదని, పలు సమస్యలు ఉన్నా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఉగాది కవి సమ్మేళనానికి ఆహ్వానం

శ్రీకాకుళం కల్చరల్‌: తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం గ్రాండ్‌ హోటల్‌లో జిల్లా స్థాయి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది లేదా సమాజహితమైన రచనలతో హాజరుకావాలని, ఈ నెల 17లోగా 8121559001 నంబర్‌కు ఫోన్‌ చేసి పేరు నమోదు చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement