హిరమండలం: గొట్టా బ్యారేజీకి సంబంధించి యాఫ్రాన్‌ను మెట్ల రూపంలో నిర్మించేందుకు జల వనరుల శాఖకు సంబంధించి సీఈసీడీఓ అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం గొట్టా బ్యారేజీతో పాటు వంశధార ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణ పనులు పరిశీలించారు. కుడి ప్రధాన కాలువ పరిస్థితిని సైతం ఆరాతీశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గొట్టా బ్యారే జీ ఆధునికీకరణ పనులకుగాను రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా జలవనరుల శాఖకు సంబంధించి సీఈసీడీఓ బృందం పరిశీలించింది. సమగ్ర నివేదికను తయారుచేసే పనిలో పడింది. ప్రధానంగా గొట్టా బ్యారేజీకి సంబంధించి యాఫ్రాన్, చెదిరిపోయిన రాతి కట్టడాలను పరిశీలించారు. రాష్ట్రంలో మిగతా ప్రాజె క్టులకు సంబంధించి మెట్ల రూపంలో నిర్మాణానికి ఉన్న అవకాశాలపై స్థానిక అధికారులతో చర్చించారు. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్‌తో ముడిపడిన అన్ని నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వంశధార ఎస్‌ఈ రామచంద్రరావు వారికి వివరించారు. సీఈసీడీఓ బృందంలో విజయభాస్కర్, శివకుమార్, కేదారేశ్వర్‌రెడ్డి, రేనా, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. వారి వెంట ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ స్వర్ణకుమార్, ఈఈలు రవీంద్ర, మురళీ మోహన్, డీఈఈలు సరస్వతి, నాగేశ్వరరావు, రామకృష్ణ, అనిల్, సాయిరాం, కిశోర్, ఏఈలు ధనుంజయ, పరిశుద్ధబాబు, ఆనందరావు, సోమే శ్వరరావు, దిలీప్, అనిల్‌కుమార్, రంజిత్, రాఘవేంద్ర, సోమ కాంట్రాక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గొట్టా బ్యారేజీని పరిశీలిస్తున్న అధికారుల బృందం


