కుమారుడికి తల్లి అంత్యక్రియలు
శ్రీకాకుళం రూరల్: అనారోగ్యంతో మృతి చెందిన కుమారుడికి తల్లే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మండల పరిధి సానివాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. సానివాడ గ్రామానికి చెందిన అప్పారావు రాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడు రాజు (40) అనారోగ్యంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఇదే కుటుంబంలో రెండు నెలలు క్రితం రెండో కుమారుడు అనారోగ్యంతో కన్నుమూయగా, అప్పట్లో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తాజాగా పెద్ద కుమారుడు మృత్యువాత పడడంతో తల్లి రాజేశ్వరి అంత్యక్రియలు నిర్వహించింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అమలుకున్నాయి.


