మెలకువలతోనే.. మెరుగైన మార్కులు
● దస్తూరితో పాటు కీలక పాయింట్లు రాస్తే ఉత్తమ ఫలితాలు ● సబ్జెక్టుల వారీగా టెన్త్ విద్యార్థులకు ఉపాధ్యాయుల సూచనలు
శ్రీకాకుళం: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలక ఘట్టం. ఇక్కడి ఫలితమే చాలావరకు భవిష్యత్తును నిర్ణయిస్తుంటుంది. ఈ నేపథ్యంలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు కుస్తీ పడుతున్నారు. మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు పలు జాగ్రత్త లు తీసుకోవాలని సబ్జెక్టు ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.ఈ ఏడాది జిల్లా నుంచి 28,586 మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో 21,350 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి పరీక్షలు రాస్తున్నారు. వీరికి సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
తెలుగును అర్థం చేసుకుంటూ చదివితే మంచి మార్కులు సాధించడం సులువు. ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా ముందుగా చదవాలి. పద్యం గద్యం ఉపవాచకం వంటి ప్రశ్నలు ఉంటాయి. చేతిరాత ఆకట్టుకునేలా ఉండాలి.
– పిసిని వసంతరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, లావేరు
సాంఘిక శాస్త్రంలో ప్రశ్నలన్నీ పరోక్ష పద్ధతిలో వచ్చే అవకాశాలుంటాయి. ఎనిమిది మార్కుల ప్రశ్నలకు సమాధానాలు పెద్దగా ఉన్నాయని భయపడకూడదు. నాలుగైదు రకాల మ్యాపులను గుర్తించడంపై దృష్టి పెట్టాలి.
– ఉప్పాడ సూర్యనారాయణ, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం, శ్రీకాకుళం


