యూరియా అక్రమ పంపిణీపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యూరియా అక్రమ పంపిణీపై చర్యలు తీసుకోవాలి

Feb 19 2026 10:11 AM | Updated on Feb 19 2026 10:11 AM

యూరియ

యూరియా అక్రమ పంపిణీపై చర్యలు తీసుకోవాలి

● నేత్రపర్వం.. చక్రతీర్థ స్థానం

వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రైతులకు అందజేయాల్సిన యూరియాను అక్రమ మార్గంలో ఇతరులకు సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గార మండలంలోని వమరవల్లి గ్రామ సచివాలయానికి 444 బస్తాల యూరియా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా వచ్చిందని, అయితే ఆ యూరియాను తూలుగు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సిబ్బంది ఈనెల 15వ తేదీన వమరవల్లి గ్రామ సచివాలయం గోడౌన్‌ తాళాలు తీసి అక్రమంగా పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రైతులు నిలదీయడంతో గోడౌన్‌ షట్టర్లు దించి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఈ విషయంపై గార తహసీల్దార్‌, వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆయనతో పాటు ఎంపీపీ గొండు రఘురాం, పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పీస శ్రీహరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మార్పు పృథ్వీ, జిల్లా గ్రీవెన్స్‌ విభాగం అధ్యక్షుడు రౌతు శంకరరావు, మండల రైతు విభాగం అధ్యక్షుడు సిమ్మ ధర్మరాజు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి వజ్జ వెంకట అప్పలనాయుడు, స్టేట్‌ సోషల్‌ మీడియా బైపురెడ్డి నాని, మార్పు రాకేష్‌, గంట రఘునాథ్‌ రెడ్డి, సీపాన ఉమామహేశ్వరరావు, తార కృష్ణారెడ్డి, ఎన్ని వాసు, గార మండలం సోషల్‌ మీడియా కార్యకర్త సన్యాసి, ఆరంగి శ్రీనివాస్‌, అప్పుయాదవ్‌ తదితరులు ఉన్నారు.

టెక్కలి మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరువీధి, చక్రతీర్థ స్నానాలు నేత్రపర్వంగా బుధవారం నిర్వహించారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి జి.గురునాథరావు ఆధ్వర్యంలో మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భ్రమరాంబ సహిత మల్లిఖార్జునస్వామి ఉత్సవమూర్తులకు గ్రామంలో తిరువీధి నిర్వహించారు. దీంట్లో భాగంగా దారి పొడవునా నిర్వహించిన కోలాటం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం సీత కోనేరులో ఉత్సవమూర్తులకు చక్రతీర్థ స్నానాలు నిర్వహించారు. – టెక్కలి

డీ–పట్టా యజమానికి నోటీసులు

యూరియా అక్రమ పంపిణీపై చర్యలు తీసుకోవాలి 1
1/1

యూరియా అక్రమ పంపిణీపై చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement