చలో సరుబుజ్జిలి పోస్టర్ ఆవిష్కరణ
సరుబుజ్జిలి: థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో 25న తలపెట్టిన చలో సరుబుజ్జిలి ర్యాలీ కార్యక్రమం పోస్టర్‌ను పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి ఆధ్వర్యంలో వెన్నెలవలస గ్రామంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్న థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు విరమించే వరకు పోరాటాలు చేయక తప్పదని వెల్లడించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ క్యార్యదర్శి సవర సింహాచలం, సహాయ కార్యదర్శి సవర ధర్మారావు, కార్యవర్గ సభ్యులు సవర మిన్నారావు, సవర ఆదయ్య, సవర చుక్కడు పాల్గొన్నారు.


