విప్లవకారుడిగా వెళ్లి.. విగతజీవిగా ఇంటికి
● జోగారావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
● మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు
అప్పగించిన పోలీసులు
● బాతుపురంలో అంత్యక్రియలు నేడు
ఇఇ
వజ్రపుకొత్తూరు రూరల్:
పోలీసు తూటాలకు బలైపోయిన మావోయిస్టు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతదేహం కోసం సొంతూరు వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఉద్యమంలో చేరి 37 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి అల్లూరి సీతారామరా జు జిల్లా మారేడుమిల్లి వద్ద బుధవారం జరిగిన కాల్పుల్లో ప్రాణాలు వదిలిన జోగారావు ఆఖరి చూ పు కోసం ఉద్దానం ఎదురు చూస్తోంది. పీపుల్స్‌వార్ పార్టీ సిద్ధాంతాలతో ఉద్దాన ప్రాంతంలో ఆ పార్టీ నాయకత్వం బలోపేతానికి అడుగులు వేస్తున్న క్రమంలో అదే పార్టీ నాయకుడు మడ్డు బాబూరావుకు కొరియర్‌గా జోగారావు పని చేశారు. తర్వాత దశలో 1988లో పార్టీలో చేరి పూర్తిగా ఉద్యమాలు చేస్తూ మావోయిస్టు అగ్రనేతగా మారారు. బాంబులు తయారు చేయడంలో నేర్పరిగా ఎదిగారు. సాంకేతిక పరిజ్ఞానం వంటబట్టించుకోవడంతో టెక్ శంకర్ అనే పేరును సంపాదించారు. చిన్నతనం నుంచి తోటి వారికి సాయం చేసే గుణం ఉన్న జోగారావు అంచెలంచెలుగా మావోయిస్ట్ దళాలలో డిప్యూటీ కమాండర్‌గా ఎదిగారు.
ఆఖరి చూపు కోసం ఎదురుచూపు
ఉద్దాన ప్రాంతంలో ప్రాంతంలో పుట్టి 15 ఏళ్ల పా టు బాతుపురం గ్రామంలో తన కుటుంబ సభ్యు లు, బంధువులు, తోటి స్నేహితులతో సరదాగా గడిపిన జోగారావు ఉద్యమాల్లో చేరి నేటికి 37 ఏళ్లవుతోంది. అలనాటి జ్ఞాపకాలను కుటుంబ సభ్యు లు, తోటి స్నేహితులు నేమరు వేసుకుంటున్నారు. ఆయన ఇక లేడు, రాడు అన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శంకర్‌ను కడసారి చూసేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే బుధవారం ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సామాజిక కార్యక్తలు కొంతమంది శంకర్ మృతదేహం కోసం అదే రోజు సాయంత్రం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి బయల్దేరారు. గురువారం మృతదేహం అప్పగింత ప్రక్రియ పూర్తయ్యింది. జోగారావు సోదరుడైన మెట్టూరు మధుసూదన్ వైద్య పరీక్షలు చేసి రక్త సంబంధీకులు అని నిర్ధారణ అయ్యాక పోస్టుమార్టం గదికి పంపించినట్లు భోగట్టా. మృతదేహానికి నేడు బాతుపురంలో అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రెండుసార్లు పోలీసులకు చిక్కి..
పీపుల్స్ వార్ పార్టీలో జోగారావు కొరియర్‌గా పని చేస్తున్న కాలంలో ఉద్దానంలో గ్రనేడ్ పేలడంతో పార్టీకి చెందిన నాయకులు గాయాల పా లయ్యారు. వీరిని విశాఖ ఆస్పత్రికి ఒక ప్రైవేటు వాహనంలో తీసుకొని వెళ్తున్న సందర్భంలో నరసన్నపేట వద్ద జోగారావుతో పాటు మిగిలిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది నెల లు జైలు జీవితం అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చారు. జోగారావు మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అప్పగించిన పని మీద నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్తున్న జోగారావు విజయవాడ నుంచి తిరుగు ముఖం పట్టాల్సి వచ్చింది. అదే సమయంలో ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎం.సుబ్బారాం రెడ్డి హత్య జరగడం, జోగారావు పోలీసులకు చిక్కడం, అతని చేతిలో విజయవాడ కేంద్రం పేపర్ ఉండడంతో సుబ్బ రాం రెడ్డి హత్యలో జోగారావు పాత్ర ఉందని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ పై వచ్చిన తర్వాత జోగారావు నేటి వరకు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోనే ఉన్నారు. జోగారావు మొట్టమొదట చందనగిరి దళంలోను, ఈస్ట్ డివిజన్ ఎల్లవరం దళంలోనూ డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు.
తీవ్ర శోకాన్ని నింపింది
భూమికి సూర్య చంద్రులు ఎంత వెలుగో. మావోయిస్ట్ పార్టీ నాయకులు పీడిత ప్రజలకు అంతే వె లుగు. అణగారిన వర్గాలకు, సమస్యలతో సతమ తం అవుతున్న ప్రజలకు మావోయిస్టులు అండగా ఉంటారనే ధైర్యం ఉంటుంది. జోగారావు మృతి ఉద్దాన ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది.
– పోతనపల్లి అరుణ, సామాజిక కార్యకర్త
సోదరుడిని కోల్పోవడం బాధాకరం
రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు నేడు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కోల్పోవ డం చాలా బాధాకరం. చిన్నతనం నుంచి సేవా గుణం కలిగిన వ్యక్తి. ఆయన మృతి మా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. – మెట్టూరు మధుసూదన్,
శంకర్ సోదరుడు,బాతుపురం
భుజాన మోసిన తుపాకీ బరువు.. ఆయనను కుటుంబానికి దూరం చేసింది. ఆ గుండెలో మోసిన శోకపు తీవ్రత.. సొంతూరిని కూడా కాదనుకునేలా చేసింది. ఆ గొంతుకలో పురుడు పోసుకున్న నినాదాల ఆర్థ్రత.. హితులు, చిన్ననాటి స్నేహితుల గురుతులు కూడా చెరిపేసింది. 37 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ తుపాకీ నేలకొరిగింది. ఆ శోకం రక్తపు ధారగా బయటకు వచ్చింది. ఆ గొంతు శాశ్వతంగా నిశ్శబ్దమైపోయింది. విప్లవకారుడిగా ఊరు వదిలిన మెట్టూరు జోగారావు విగతజీవిగా తిరిగి వచ్చాడు.
విప్లవకారుడిగా వెళ్లి.. విగతజీవిగా ఇంటికి
విప్లవకారుడిగా వెళ్లి.. విగతజీవిగా ఇంటికి
విప్లవకారుడిగా వెళ్లి.. విగతజీవిగా ఇంటికి


