మందుబాబుల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

మందుబాబుల హల్‌చల్‌

Nov 21 2025 2:10 PM | Updated on Nov 21 2025 2:10 PM

మందుబ

మందుబాబుల హల్‌చల్‌

చలికాలంలో ఇబ్బంది పడుతున్న హాస్టల్‌ విద్యార్థులు

చాలీచాలని దుప్పట్లు, తలుపులేని కిటికీలతో ఇబ్బందులు

కొత్తూరు: కొత్తూరు ఎస్సీ బాలుర, కడుము బీసీ బాలుర, కారిగూడలోని మినిగురుకులం, గొట్టిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, లబ్బ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలల్లో కటిక నేలపైనే విద్యార్థులు నిద్రిస్తున్నారు. కారిగూడ మినీ గురుకులంలో ఉన్న నాలుగు గదుల్లోనే భోజనాలు చేసి నిద్రిస్తున్నారు.

పర్యవేక్షణ శూన్యం

జలుమూరు: శ్రీముఖలింగం బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. వసతి గృహం అధికారి బట్న రమణ చుట్టపు చూపుగా వస్తుంటారని ఆరోపణ ఉంది. ఈయన శ్రీముఖలింగం, జలుమూరు బాలురు వసతి గృహాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించగా శ్రీకాకుళంలో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలుకల భయాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

కరెంటు కోతలు..

కవిటి: రాజపురం, పీకే పాలెం కేంద్రాల్లో బీసీ బాలు ర వసతి గృహాలు ఉన్నాయి. పీకేపాలెంలైన్‌లో రాత్రి వేళల్లో కరెంట్‌ కోతలు అప్రకటితంగా ఉంటున్నాయి. దీంతో దోమల బెడద తప్పడం లేదు.

దోమల బెడద

పాతపట్నం: పాతపట్నంలోని కోర్టు కూడలి వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్‌ బాలుర వసతి గృహం, బాలాజీ నగర్‌–3 ఉన్న ఇంటిగ్రేటెడ్‌ బాలికల వసతి గృహం, సెయింటాన్స్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం, ఎస్టీ బాయ్స్‌ హస్టల్‌, బీసీ బా య్స్‌ హాస్టళ్లలో విద్యార్థులు నేల మీదనే పడుకుంటున్నారు. దోమల బెడద ఉందని, లాబర, బైదలాపురం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు.

గదుల్లోకి చలిగాలులు

టెక్కలి రూరల్‌: టెక్కలి ఎస్సీ వసతి గృహంలో చన్నీటి స్నానాలే గతిగా మారాయి. కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలి గాలులతో ఇబ్బంది తప్పడం లేదు. ఆదిఆంధ్రవీధిలో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమ సామాన్లు పక్కకు జరిపి నిద్రపోతున్నారు.

చల్లటి నీరే గతి

సోంపేట: బారువ గ్రామంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. ఉదయం మోటారు వేసుకుని ఆ చల్లని నీటితోనే స్నానం చేస్తున్నారు.

ఎవరికి వారే..

గార: అంపోలు బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వార్డెన్‌ పగలు ఉండి రాత్రి వెళ్లిపోతారని విద్యార్థులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఉండేవారని, ప్రతి రోజూ అంపోలులో ఉన్న సొంతింటికి వెళ్లిపోతారని విద్యార్థులు చెప్పారు. ఇక్కడ చలిలో నేలబారు నిద్రలు కనిపించాయి.

శీతగాలి తాకిడి

ఎచ్చెర్ల: మురపాకలో విద్యార్థులు నిద్రిస్తున్న ప్రదేశాల్లో ఉన్న కిటికీలు, తలుపులు పాడయ్యాయి. ఫరీదుపేట వసతి గృహంలో రేకుల షెడ్‌కు కిటికీలకు తలుపులు లేవు. స్థానిక విద్యార్థులు రాత్రిళ్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. డి.మత్స్యలేశం వసతి గృహంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఆమదాలవలస

ఎస్సీ బాలురు వసతి గృహంలో ఉదయాన్నే చలిగాలిలో

బోరు వద్ద వణుకుతూ..

చన్నీటి స్నానాలు

వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి బీసీ బాలుర వసతి గృహం మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. విద్యార్థులను భయపెట్టి మరీ మందుబాబులు వసతి గృహంలోకి ప్రవేశిస్తున్నారు. విద్యార్థులు స్నానాలు చేసే దగ్గర, బోరు వద్ద బల్బులు లేవు.బాత్‌ రూమ్‌, మరుగుదొడ్లకు బల్బులు లేవు. విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. రాత్రివేళ హాస్టల్‌ డాబాపై మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.

చన్నీటి స్నానాలు

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో సాంఘిక సంక్షేమ (ఎస్సీ) బాలురు–1, బాలికలు–1, బీసీ బాలురు–1, బాలికలు–1 వసతిగృహాలు ఉన్నాయి. శీతాకాలంలో వీరికి దుప్పట్లు చాలడం లేదు. పరుచుకోవడానికి ఒకటి, కప్పుకోవడానికి మరొకటి వినియోగిస్తున్నారు. అలాగే చన్నీటి స్నానాలు తప్పడం లేదు.

నేలపైనే నిద్ర

సంతబొమ్మాళి: నౌపడ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. అదనపు మరుగుదొడ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. హాస్టల్‌ చుట్టూ ముళ్ల చెట్లు పెరిగిపోయి భయంకరంగా కనిపిస్తున్నాయి. తలుపులు అక్కడక్కడా విరిగిపోయి ఉన్నాయి.

మందుబాబుల హల్‌చల్‌1
1/3

మందుబాబుల హల్‌చల్‌

మందుబాబుల హల్‌చల్‌2
2/3

మందుబాబుల హల్‌చల్‌

మందుబాబుల హల్‌చల్‌3
3/3

మందుబాబుల హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement