బాలుడి నిజాయితీ
ఇచ్ఛాపురం: పట్టణంలోని గొల్లవీధికి చెందిన రోహి త్ పూరి అనే బాలుడు తనకి దొరికిన సుమారు మూడు లక్షలు విలువైన రెండుతులాల బంగారు చైన్‌ని తిరిగి బాధితునికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. స్థానిక మాజీ సైనికోద్యోగి డి.విశ్వ నాథం బుధవారం తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మెడలోని బంగారు చైన్ పోగొట్టుకున్నారు. ఈ చైన్ రోహిత్‌కి దొరికింది. అప్పటికే చైన్ వెతుక్కుంటూ వస్తున్న విశ్వనాథను రోహిత్ గుర్తించి చైన్ అందజేశాడు. ఈ సందర్భంగా బాలుడి నిజాయితీని మెచ్చిన సైనికోద్యోగి ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమక్షంలో గురువారం సన్మానించారు. బాలుడి తండ్రి లోకనాథ్‌పూరి, కొండా శంకర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.


