అథ్లెటిక్స్‌లో అదరగొట్టండి..!
23న అస్మిత అథ్లెటిక్స్ లీగ్–2025 పేరిట బాలికలకు పోటీలు అండర్–14, 16 విభాగాల్లో నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
సద్వినియోగం చేసుకోవాలి..
అమ్మాయిలూ..
హైజంప్ సాధనలో ఓ అథ్లెట్
శ్రీకాకుళం న్యూకాలనీ:
శ్రీకాకుళం వేదికగా బాలికల అథ్లెటిక్స్ పోటీల కు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న అస్మిత అథ్లెటిక్స్ లీగ్–2025 పేరిట బాలికలకు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించాల ని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు మొదలుకానున్నాయి. ఒక్కరోజులోనే పోటీలను ముగించి, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిభ కలిగిన బాలికలను గుర్తించేందుకుగాను ఖేలో ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ వారి సౌజన్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా, రాష్ట్ర అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. పోటీలకు హాజరయ్యే బాలికలు తమ వెంట జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. పూర్తి వివరాలకు సాంబమూర్తి (సెల్: 8500271575), సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు (సెల్: 9441570361) నంబర్లను సంప్రదించాలని కోరారు.
●అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పోటీలు అండర్–14, అండర్–16 రెండు విభాగాల్లో బాలికలకు వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అండర్–14 బాలికలు 2011 డిసెంబర్ 21 నుంచి 2013 డిసెంబర్ 20 తేదీ మధ్య జన్మించి ఉండాలి. అండర్–16 బాలికలు 2009 డిసెంబర్ 21 నుంచి 2011 డిసెంబర్ 20 తేదీ మధ్య జన్మించి ఉండాలి.
●అండర్–14 బాలికలకు: ట్రయాథ్లెన్– ఏ కేటగిరిలో 600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్. ట్రయాథ్లెన్–బి కేటగిరీలో 60 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్. ట్రయాథ్లెన్– సి కేటగిరిలో 60 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, 600 మీటర్ల పరుగు, కిడ్స్ జావెలిన్‌త్రోలో ఈవెంట్స్ జరుగుతాయి.
●అండర్–16 బాలికలకు: 60 మీటర్ల పరుగు, 600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కెస్‌త్రో, జావెలిన్‌త్రోలో ఈవెంట్స్ జరుగుతాయి.
అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పేరి ట నిర్వహించనున్న క్రీడాకారిణుల గుర్తింపు ప్రక్రి య ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. రాణించిన అథ్లెట్స్‌కు బంగారు భవిష్యత్తు లభించనుంది. జిల్లాలోని యువ అథ్లెట్లు పోటీలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలి.
– కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్
అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు
అథ్లెటిక్స్‌లో అదరగొట్టండి..!
అథ్లెటిక్స్‌లో అదరగొట్టండి..!


