తైక్వాండో పోటీల్లో ముగ్గురికి స్వర్ణ పతకాలు
ఇచ్ఛాపురం : ఇటీవల ఏలూరు, కడపలో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలు (ఎస్జీఎఫ్) తైక్వాండో విభాగంలో ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ం సూర్యారావు సోమవారం తెలిపారు. అండర్–17 విభాగంలో ఆశి రెవంత్‌రెడ్డి, తిప్పన జీవన్‌రెడ్డి, అండర్–19 విభాగంలో చాట్ల గిరి స్వర్ణ పతకాలు సాధించారని చెప్పారు. వీరు ఈ నెల 7 నుంచి 10 వరకు జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అండర్–19 జాతీయస్థాయి పోటీలకు, ఈ నెల 20 నుంచి 25 వరకు అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ఇటానగర్‌లో అండర్–17 జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శారద, రంగారావు, ఉపాధ్యాయులు కామరాజు, సూర్యం, జయలక్ష్మి, ఎస్‌ఎంసీ ప్రతినిధులు ఆశా లతారెడ్డి, శ్రీధర్, గౌరీశంకర్, తైక్వాండో కోచ్ సీహెచ్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత శిబిరానికి వర్సిటీ విద్యార్థులు
ఎచ్చెర్ల : హర్యానాలో జరగనున్న జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొనేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమ వారం పయనమయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక, కళలు, క్రీడలు, అభిరుచులు వంటివి పరస్పరం పంచుకొని దేశ ఐక్యతలో యువతను భాగస్వామ్యం చేయడంలో భాగంగా జాతీయ స్థాయిలో ఈ నెల 4 నుంచి వారం రోజుల పాటు శిబిరం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వర్సిటీ క్యాంపస్‌కు చెందిన ఎన్.త్రివేణి, కె.పవన్, జి.రవి, జి.శ్రావణి, ఎస్.సాయిప్రదీప్, ఎస్.భార్గవి, జి.చంద్రశేఖర్, పి.అభిషేక్, ఎస్.అంకిత, ఎం.పవిత్రలు ఎంపికయ్యారు. ఈ బృందానికి ఎన్‌ఎస్‌ఎస్ పీవో డాక్టర్ కె.కరుణానిధి నేతృత్వం వహి స్తున్నారు. వీరిని వీసీ రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డి.వనజ అభినందించారు.
తైక్వాండో పోటీల్లో ముగ్గురికి స్వర్ణ పతకాలు


