ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి
● వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్
టెక్కలి: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని, బాధ్యులను పక్కన పెట్టి ఆలయ ధర్మకర్తపై ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సంఘటన జరిగిన తర్వాత అధి కార పార్టీ నాయకులు, మంత్రులు హడావుడి చేశారని, కానీ ఏకాదశి నాడు ఆలయంలో రద్దీ ఉంటుందని తెలిసినా పోలీసు బందోబస్తు కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని తెలి పారు. కాశీబుగ్గలో జరిగిన సంఘటన నేప థ్యంలో తాత్కాలికంగా హడావుడి చర్యలు కా కుండా ఆలయాల్లో ప్రత్యేకమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల చొప్పు న పరిహారం ఇచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం విషయంలో పక్షపాతం చూపించారని వెల్లడించారు. గతంలో ఆలయాల్లో జరిగిన సంఘటనల్లో మృత్యవాత పడిన వారికి ఎంత మేరకు సాయం అందజేశారో అంతకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని తిలక్ డిమాండ్ చేశారు.
11 నుంచి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్
పాతపట్నం: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్ పాతపట్నంలోని గిరిజన సామాజిక మైదానంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రమ ణారావు తెలిపారు. సోమవారం పాతపట్నం గిరిజన సామాజిక మైదానంలో రాష్ట్ర వ్యాయా మ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్ బాబు ఆధ్వర్యంలో సాఫ్ట్ టెన్నిస్ కోర్టులను పీడీలు, పీఈటీలు తయారు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గురాడి అప్పన్న, సెక్రటరీ జె.షణ్ముఖరావు, ఎన్ని దీలిప్, లోకేశ్వరరావు, శ్రీనువాసరావు, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘హాస్టళ్లు పరిశుభ్రంగా
ఉంచాలి’
పాతపట్నం: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహాన్ని పీఓ సోమవారం పరిశీలించా రు. వసతి గృహంలోని స్టోర్ రూం, వంట గది, విద్యార్థులు గదులను పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. విద్యార్థులు వసతి గృహంలో మరుగుదొడ్లు సక్రమంగా లేవని, కిటీకిలకు మెస్‌లు లేవని, వర్షం వస్తే గదుల్లోకి నీరు చెమ్మ వస్తుందని, పలు సమస్యలను పీఓ తెలియజేశారు. కార్యక్రమంలో డీఈఈ రాజు, వసతిగృహం సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులపై తేనెటీగల దాడి
నరసన్నపేట: మండలం ఉర్లాంలోని బాలత్రిపుర సుందరీశ్వరాలయం వద్ద సోమవారం పూజల కోసం క్యూలో ఉన్న భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయం వద్ద ఉన్న చెట్టుపై తేనె పట్లు ఉన్నాయి. పక్షులు ఎరగడంతో పట్టు కదిలింది. వెంటనే తేనెటీగలు గుంపు లు గుంపులుగా వచ్చి క్యూలో ఉన్న భక్తులపై దాడి చేశాయి. దీంతో అంతా పరుగులు తీశారు. కొందరు చెరువులో దూకారు. మొత్తం 15 మంది గాయపడ్డారు. ఉర్లాంతో పాటు చింతవానిపేట, బడ్డవానిపేట, జగ్గునాయుడుపేట, కుమ్మరిపేటలకు చెందిన భక్తులు తేనెటీగల దాడికి గురయ్యారు. బాగా గాయపడిన వారికి స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందించారు.
ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి
ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి


