అంతర్జాతీయ పోటీలకు సిక్కోలువాసులు
● రికార్డుస్థాయిలో ఏడుగురు ప్రాతినిధ్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి రికార్డుస్థాయిలో ఏడుగురు ఎంపికయ్యారు. ఈ మెగా స్పోర్ట్స్‌మీట్ ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు తమిళనాడులోని చైన్నె నగరం వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనవారిలో పాలకొండ అప్పారావు, ఎం.భాగ్యలక్ష్మి, జె.రవి, వి.చిన్నబాబు, ఓ.శ్రీనివాసరావు, ఎం.కామయ్య, ఎల్.ప్రసాదరావు ఉన్నారు. వీరంతా ఇటీవలి జరిగిన జాతీయ పోటీల్లో పతకాలు సాధించడంతో ఏషియన్ మీట్‌కు ఎంపికయ్యారు. వివిధ వయో విభాగాల్లో రన్స్, జంప్స్, త్రోస్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా నుంచి ఎంపికై న మాస్టర్స్ అథ్లెట్స్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసో సియేషన్ అధ్యక్షుడు బొడ్డేపల్లి నారాయణరావు, ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి చల్లా జగదీష్, చౌదరి పురుషోత్తమనాయుడు, వెటరన్ అథ్లెట్స్, కుటుంబ సభ్యులు అభినందించారు.


