● సర్వేకు ససేమిరా..
మందస: మందస మండలం ఉద్దాన ప్రాంతం బిడిమి, లక్ష్మీపురం, భేతాళపురం రెవెన్యూ గ్రామాల్లోకి భూ సర్వే పేరిట వచ్చిన పలాస రెవెన్యూ డివిజనల్ అధికారులతో కార్గో ఎయిర్‌పోర్టు బాధి త రైతులు సోమవారం వాగ్వాదానికి దిగారు. ఆర్డీఓ జి.వెంకటేష్ బాధిత రైతులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు కొలతల కోసం రాలేదని, రైతుల భూములు సర్వే చేయడానికి వచ్చామని చెప్పారు. కానీ దానికి కూడా జనం ఒప్పుకోలేదు. బాధిత భూముల్లో రీ సర్వే చేయడానికి ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో కార్గోఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కమిటీ సభ్యులు గుంటు లోకనాథం, దున్న హరికృష్ణ, దున్న సురేష్, నల్ల పరుశురాం, దాసరి మోహన్, బత్తిన ఉమాపతి, బత్తిన దేశయ్య, మడియా రుషి, జుత్తు హేమరాజు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో..
వజ్రపుకొత్తూరు రూరల్: అనకాపల్లి గ్రామంలో సోమవారం సర్వేకు వచ్చిన తహసీల్దార్ సీతారామయ్యను కార్గో ఎయిర్‌పోర్టు బాధితులు నిలదీశారు. తమ భూముల పేరిట ఉన్న సర్వే నంబర్లతో అడంగల్,1బిల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగితే కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చి సర్వేలు ఎందుకని ప్రశ్నించారు. జనమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంటే భూమి లెక్కలు వేయడం సబబు కాదన్నారు.


