కార్తీకానికికాశీబుగ్గ సెగ
● భక్తులను భయపెట్టిన తొక్కిసలాట దుర్ఘటన
● భద్రత భయంతో ప్రధాన ఆలయాలకు తగ్గిన భక్తులు
● అరసవల్లి తెప్పోత్సవానికి కూడా గత ఏడాది కంటే తక్కువగానే భక్తుల హాజరు
● ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు
జలుమూరు మండలంలోని ప్రసిద్ధ శ్రీముఖలింగం ఆలయమిది. ఆలయానికి సాధారణ రోజుల్లోనే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల తాకిడి ఉంటుంది. కార్తీక మాసంలో మరింత ఎక్కువ ఎక్కువ రద్దీ ఉంటుంది. 10వేలకు పైబడి భక్తులు వస్తుంటారు. కానీ, ఈసారి కార్తీక మాసం రెండో సోమ వారం భక్తుల రద్దీ తగ్గింది. మునుపటిలాగా భక్తులు రాలేదు. 5వేల నుంచి 6వేల మధ్య ఉంటుందని అంచనా. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట భయంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని చాలామంది భక్తులు తగ్గినట్టు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
కార్తీకానికి కాశీబుగ్గ సెగ తగిలింది. జిల్లాలోని దాదాపు అన్ని ఆలయాలకు రెండో కార్తీక సోమవారం భక్తుల రాక తగ్గిపోయింది. శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా ఇదే పరి స్థితి చోటు చేసుకుంది. సాధారణంగా కార్తీక మా సం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చుట్టు పక్కల ప్రాంతాలు, జిల్లాలు, ఒడిశా నుంచి ప్రతి ఆలయానికి వేలల్లో వస్తుంటారు. కార్తీక సో మవారాలైతే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కానీ ఈసారి దాదాపు ప్రతి దేవాలయంలో భక్తు ల తాకిడి తక్కువగా ఉంది. సగానికిపైగా భక్తులు ఆ ఆలయాలకు రాలేదు. గ్రామాల్లోని ఆలయాల పూజలకే పరిమితమైపోయారు. దీనికంతటికీ కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన దుర్ఘటనే కారణంగా తెలుస్తోంది. అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను భయాందోళనకు గురి చేసింది. అంతదూరం వెళ్లి ఇబ్బంది పడటం కంటే స్థానికంగా ఉన్న దేవాలయాల్లోనే పూజలు చేసుకుంటే సరిపోతుందని భక్తులు భావించారు. ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం వద్ద ఆదివారం జరిగిన తెప్పోత్సవానికి భక్తుల సంఖ్య తగ్గింది. గతేడాది ఏడాదితో పోల్చితే ఈసారి సంఖ్య తగ్గినట్టు అంచనా.
ముఖ్యంగా శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, బెండి నందికేశ్వర ఆలయం, మహేంద్ర గిరి, బెండి నందికేశ్వర ఆలయం.. ఇలా అన్ని ప్రధాన దేవాలయాలకు భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాశీబుగ్గ దుర్ఘటనతో పోలీసులు అప్రమత్తమై ఆదివారం, సోమవారం అధిక సంఖ్యలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసిననప్పటికీ భక్తులకు నమ్మకం కలగలేదు. రద్దీని కంట్రోల్ చేయలేరన్న భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు భక్తులను కలిచివేయడమే కాకుండా భయాందోళనకు గురి చేస్తున్నా యి. ఈ ప్రభుత్వం భక్తులకు భద్రత కల్పించలేదని, ఎప్పుడు ఏ సంఘటన చోటు చేసుకుంటుందోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. దైవదర్శనాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందని, రద్దీ దృష్ట్యా ప్రధాన ఆలయాలకు వెళ్లాలంటేనే భయమేస్తోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు పలుచగా ఉన్న దృశ్యమిది. ఉదయం 10గంటల సమయంలో ఉచిత దర్శనం కూడా వేగంగా జరిగిపోయింది. సాధారణంగా ఈ ఆలయానికి కార్తీక సో మవారాల్లో 15 వేల మంది వరకు వస్తుంటారు. కానీ ఈసారి రెండో సోమవారం 5నుంచి 6వేల వరకు వచ్చారని అంచనా. ఈ ఆలయానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి వస్తారు. ముఖ్యంగా ఒడిశా వాసులు మరింత నమ్మకంగా పూజిస్తారు. కాశీబుగ్గ దుర్ఘటనతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బాగా తగ్గిపోయింది.
వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలోని శ్రీ నందేశ్వరాలయానికి భక్తుల రాక ఒక్కసారి తగ్గిపోవడంతో వెలవెలబోయింది. జీవగడ్డ ఒడ్డున ఉండటం, దేవతలు నిర్మించారని ప్రచారం ఉండటం వల్ల ఏటా కార్తీక మాసంలో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. అయితే, ఈ రెండో సోమవా రం భక్తుల తాకిడి కన్పించలేదు. ఉదయం 11గంట ల సమయానికే క్యూలు ఖాళీ అయిపోయాయి.
కార్తీకానికికాశీబుగ్గ సెగ
కార్తీకానికికాశీబుగ్గ సెగ


