ఇది ఒంటూరు కథ | - | Sakshi
Sakshi News home page

ఇది ఒంటూరు కథ

Nov 4 2025 7:46 AM | Updated on Nov 4 2025 7:46 AM

ఇది ఒ

ఇది ఒంటూరు కథ

దాహం కేకలు పెడుతున్న ఒంటూరు

రెండేళ్లుగా పంట లేక ఎండిపోయిన 50 ఎకరాల భూములు

గత నెల నుంచి జల్‌జీవన్‌మిషన్‌ తాగునీరు కూడా బంద్‌

కవిటి: రెండేళ్లయ్యింది ఆ యాభై ఎకరాల పొలాల గొంతు తడిచి. నెల రోజులైపోయింది ఆ వంద గడపలకు స్వచ్ఛమైన నీరు అంది. ఒంటూరు దాహం కేకలు పెడుతోంది. ఉప్పునీరు తాగలేక, కన్నీళ్లతో దాహం తీరక, స్వచ్ఛమైన నీటికి నోచుకోక నరకం చూస్తోంది. ఈ గ్రామంలో అందరూ సన్నకారు, చిన్నకారు రైతులే. వారు గత రెండేళ్లుగా ఖరీఫ్‌ పంట కూడా పండించుకోలేకపోతున్నారు. గ్రామానికి ఒక వైపు సముద్రం మరో వైపు చిన్న బీలబట్టి ఉంటుంది. దీంతో భూగర్భ జలాలు ఉప్పుగా మారిపోయాయి. పంటకు ఈ నీరు పనికి రాదు. తాగేందు కు కూడా వీలుండదు. గత నెల మూడోవారం వర కు జల్‌జీవన్‌మిషన్‌ పథకం నీటితో గొంతు తడుపుకునేవారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం వద్ద ఇటీ వల జరిగిన పల్లెపండుగ రోడ్డు పనుల పుణ్యమా అని భూ గర్భ పైప్‌లైన్‌ దారుణంగా దెబ్బతినడంతో ఊరికి నీరు ఆగిపోయింది.

ఈ పైప్‌లైన్‌ బాగు చేసేందుకు వెళ్లిన సిబ్బందిని ఆ పల్లె పండుగ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌ బెదిరించారు. రోడ్డుకు క్వాలిటీ కంట్రోల్‌ చెకింగ్‌ కాలేదని, ఏదైనా దెబ్బ తింటే తాను నష్టపోతానని ఆయన చెబుతున్నాడు. దీంతో ఆఖరుకు గ్రామస్తులకు తాగునీరు రాకుండా పోయింది. ఇటీవల పంచాయతీ సిబ్బంది నాలుగు ట్యాంకుల నీరు అందించడంతో దాన్నే వారు తాగుతున్నారు.

వంటకు నీరు కొన్నాం..

ఇటీవల మా పాప పెళ్లి జరిగింది. పెళ్లి విందు కోసం తాగునీరు, వంటకోసం దాదాపు రూ.10,000 ఖర్చు చేసి నీరు కొనుగోలు చేశాను. ఆధునికత పెరిగిన నేటి రోజుల్లో నీటి కోసం ఇంతఖర్చు చేసిన నాలాంటి దురదృష్టవంతుడు ఇంకా ఎవ్వరూ ఉండరేమో.

– జి.దానయ్య,ఒంటూరు

స్నానాలకూ ఇబ్బందే

మా ఊరు ఎదురుగా సముద్రం, పడమర బీలబట్టిలో ఉప్పునీరు. స్నానం చేయడానికి కూ డా వీల్లేని దయనీయ స్థితిలో గడుపుతున్నాం. ఇటీవల సర్పంచ్‌ మూడు ట్యాంకుల నీరు తెప్పిస్తే వాటినే వాడుకుంటున్నాం.

– పి.గౌరమ్మ, మహిళ, ఒంటూరు

రెండేళ్లుగా పంటలేదు

నాది ఒంటూరు గ్రామం. ఇక్క డ పంట లేకపోవడంతో హైదరాబాద్‌ వలస వెళ్లిపోయా డు. అక్కడ ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రస్తు తం నాకు ఒక మనవరాలు, కోడలు ఉన్నారు. ఎకరం పొలం ఉంది. కానీ వర్షాధారం కావడంతో రెండేళ్లుగా పంటలేదు. ఇప్పుడు తాగునీరూ దొర కడం లేదు. దేవుడికి కూడా మా మీద దయ లేదు.

– కదిరి కామయ్య,ఒంటూరు

కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ చర్యలు తీసుకుంటే గానీ మాకు వేరే దిక్కులేదు. మా ఊరికి ఉన్న ట్యాంక్‌ కూడా లీకులు అవుతోంది. తేళ్లు, జెర్రిలు ఉండే ఈ ట్యాంక్‌ నీరే మాకు ఆధారం. దాన్నైనా బాగు చేయాలి.

– పి.చందరరావు, ఒంటూరు

ఇది ఒంటూరు కథ 1
1/5

ఇది ఒంటూరు కథ

ఇది ఒంటూరు కథ 2
2/5

ఇది ఒంటూరు కథ

ఇది ఒంటూరు కథ 3
3/5

ఇది ఒంటూరు కథ

ఇది ఒంటూరు కథ 4
4/5

ఇది ఒంటూరు కథ

ఇది ఒంటూరు కథ 5
5/5

ఇది ఒంటూరు కథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement