శ్రీముఖలింగంలో పటిష్ట బందోబస్తు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి భద్రతకు సుమారు 50 మంది పోలీసులను వినియోగించామని జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు. ‘శ్రీముఖలింగంలో భక్తులకు భద్రత ఏదీ..? అన్న శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నరసన్నపేట సీఐ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం సజావుగా జరిపించామని పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణ ద్వారం వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
శ్రీముఖలింగంలో పటిష్ట బందోబస్తు


