16 నెలల్లో వరుస దారుణాలు
చంద్రబాబు పాలనలో వరుస దారుణాలు జరుగుతున్నాయని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు దేవుడు పేరు ఎత్తిన ప్రతి సారి ఏదో ఒకటి జరుగుతోందన్నారు. ఆయనకు దేవుడిపై విశ్వాసం లేదన్నారు. లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీ వంటివాటిపై లేనిపోని మాటలు ఆడి ఎదుటి వారిపై బురద జల్లితే అనర్థాలు జరుగుతాయన్నారు. పలాస–కాశీబుగ్గలో సంఘటన జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్ద ఉండకుండా భజన పరుల్లా తబలాలు వాయిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్‌ను సైతం తరిమేశామంటూ చంద్రబాబును క్రియేట్ చేయడం సిగ్గుచేటన్నారు. పరిపాలన చేతకాకపోతే అఖిలపక్షం నాయకులను కూర్చోబెట్టి మాట్లాడించాలని సూచించారు.
ఆలయానికి తాళం పడింది. ఆవరణ అంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రాంతమంతా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. కన్నీళ్లు ప్రవహిస్తున్న ఆ ఇళ్ల వాకిళ్లకు పరామర్శలు, పరిహారాలు, ఓదార్పులు కాసింత ఊరటనిచ్చాయి. వైఎస్సార్ సీపీతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆస్పత్రులకు కూడా వెళ్లి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఈ ఘటన వెనుక నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం రూరల్:
పలాస–కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమన్నారు. దీనిపై వెంటనే జ్యుడీషియల్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న వారి కి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు వరకూ పెంచాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు.
సంఘటన జరిగిన రోజు సీఎం చంద్ర బాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సబబు కాదని ఆయన అన్నారు. తాను నిమిత్తమాత్రుడినని, ప్రైవేట్ ప్రాపర్టీ ఆలయాలకు తమకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో రామాలయాలు, అమ్మవారి ఆలయాల్లో ఏవైనా ఘటనలు జరిగితే ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా అని ప్రశ్నించారు. ఓ పత్రికలో ప్రభుత్వ వైఫల్యం అని ప్రస్తావించారని, పెద్ద ఎత్తున భక్తులు వస్తార ని సమాచారం ఉన్నా, ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కలెక్టర్ సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెలిపారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాస రావు, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి, విజయనగరం పార్లమెంటరీ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, పార్టీ సామాజిక వర్గాల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిల శ్రీనివాస్, గొండు కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, జెడ్పీటీసీ టొంపల సీతారాం, పిన్నింటి సాయికుమార్, రాష్ట్ర మేధావుల ఫోరం ప్రతినిధి పిల్లల రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయ, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ, మండలాధ్యక్షుడు చిట్టి జనార్దన్‌రావు, సర్పంచ్ గేదెల శంగల్వరావు, పార్టీ నాయకులు యజ్జల గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
16 నెలల్లో వరుస దారుణాలు
16 నెలల్లో వరుస దారుణాలు
16 నెలల్లో వరుస దారుణాలు
16 నెలల్లో వరుస దారుణాలు


