కమిటీ వేశాం
దేవాలయం వద్ద సమాచారం ఇవ్వడానికి ఎవరూ లేరు. ఘటనపై విచారణకు కమిటీ వేశాం. ఆలయ సంప్రోక్షణ జరిగాక మళ్లీ తెరవాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా ప్రతి దేవాలయం వద్ద కూడా భక్తుల సౌకర్యార్థం తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడి ఆలయ నిర్మాణంలో సరైన ఇంజినీర్లు, వేదపండితులు సలహాలు సూచనలు కనిపించలేదు.
– ఆనం రామనారాయణ రెడ్డి,
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి
ఎప్పుడూ రెడ్‌బుక్ ధ్యాసేనా..?
రాష్ట్రంలో రెడ్‌బుక్ రా జ్యాంగం అమలుపై మాత్రమే ధ్యాస ఉన్నట్టుంది. సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే మర్యాదగా తప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఆర్‌టీజీఎస్, చంద్రబాబు తుఫాన్ కట్టడి చర్యలు ఈ సంఘటనలో ఏమయ్యాయి. ఆలయ ధర్మకర్తపై కేసులు కట్టేందుకు ప్రయ త్నించడం కేవలం చేతకానితనం.
– కురసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్
ప్రభుత్వ వైఫల్యమే
కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం. చంద్రబాబు నాయుడికి ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై, నాయకుల పైన కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రక్షణ కల్పించడంలో లేదు. కూట మి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే తిరుపతి, సింహాచలం వంటి వాటితో పాటు కాశీబుగ్గలో జరిగిన సంఘటన మూడోది. కమిటీలతో కాలయాపన చేయడం కంటే భక్తులకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తంచేయాలి. – కుంభా రవిబాబు,
పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు
ఎందరిపై చర్యలు తీసుకున్నారు
తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇప్పటికే ఏడాదిన్నర పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందారు. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు.
– ధర్మాన కృష్ణదాసు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు
నిర్లక్ష్యమే..
గతంలో చంద్రబాబు ఓవరాక్షన్ వలన పుష్కరాల్లో ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది.
– తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయకర్త
ఊరుకునేది లేదు
సమగ్ర విచారణ
తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఇలాంటి సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దినాలలో ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.
– పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
వివరాలు సేకరిస్తున్నాం
తొక్కిసలాటకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై అసత్య స మాచారం వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నాం.
– గోపినాథ్ జెట్టి, విశాఖ రేంజి డీఐజీ
టెక్కలి: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటి వరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. పరి శీలనకు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులను కూడా అడ్డుకుని తర్వాత వదిలారు. ‘దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చే యాలని కోరుకున్నాను. ఇలా జరిగితే నేనేంచేస్తాను. ఇలా జరిగిందని కేసులు కడితే నా మీ ద ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి’ అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా అన్నారు.
కమిటీ వేశాం
కమిటీ వేశాం
కమిటీ వేశాం
కమిటీ వేశాం
కమిటీ వేశాం
కమిటీ వేశాం
కమిటీ వేశాం


