పొంగిన గుమ్మా గెడ్డ
● 300 ఎకరాల్లో నీటిలోనే వరి పంట
పాతపట్నం: వరి పంట ఆశాజనకంగా ఉన్న తరుణంలో వచ్చిన మోంథా తుఫాన్ రైతుల ఆశలు అడియాసలు చేసింది. శుక్రవారం నాటికి గుమ్మా గెడ్డ, పోగడవెల్లి గెడ్డ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాల్లోకి చేరిన వరద నీటిని మళ్లించడానికి రైతు లు ఆపసోపాలు పడుతున్నారు. వ్యవసాయశాఖ ఏఓ కె.సింహాచలం నేతృత్వంలో వ్యవసాయశాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి, రైతులకు సలహాలు, సూచనలు అందజేయడమే కాకుండా పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పాతపట్నం మండలంలో గుమ్మా గెడ్డ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉందని, వరి పంట నష్టానికి గురైనట్లు వ్యవసాయాశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
నేను మూడు ఎకరాల వరి పంట వేశాను. ఇటీవల తుఫాన్ కారణంగా వరి పంట రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోయింది. నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– తూలుగు ప్రవీణ్, రైతు, తిడ్డిమి గ్రామం,
పాతపట్నం మండలం
పొంగిన గుమ్మా గెడ్డ


