నేడు కల్యాణం.. రేపు తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు కల్యాణం.. రేపు తెప్పోత్సవం

Nov 1 2025 8:20 AM | Updated on Nov 1 2025 8:20 AM

నేడు కల్యాణం.. రేపు తెప్పోత్సవం

నేడు కల్యాణం.. రేపు తెప్పోత్సవం

ఆదిత్యాలయంలో రెండు రోజుల పాటు స్వర్ణాలంకరణలో స్వామి దర్శనం

ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ప్రకటించిన ఈఓ ప్రసాద్‌

అరసవల్లి: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినోత్సవాల సందర్భంగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఆదిత్యాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం అనివెట్టి మండపంలో శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవాన్ని జరుపనున్నామని, అలాగే ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఇంద్రపుష్కరిణిలో ఆదిత్యుని ఉత్సవమూర్తులను హంసవాహనంలో ఉంచి విహరించే ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా భక్తుల దర్శనాలకు వీలుగా ప్రత్యే క ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అలాగే శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు మూలవిరాట్టుకు పూర్తిగా స్వర్ణాలంకరణ చేస్తున్నామని, ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పా టు చేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడూ స్వర్ణాదిత్యుడిని దగ్గర నుంచే దర్శించుకునేలా చర్యలు చేపడుతున్నట్లుగా ఈఓ ప్రకటించారు. ఈ రెండు రోజుల ఉత్సవాల నిర్వహణకు సంబంధిత శాఖాధికారుల సహకారాన్ని కోరినట్లుగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement