హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: డ్రైవింగ్‌లో నైపుణ్యాన్ని సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో హెవీ డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా హెవీ లైసెన్సు పొందేందుకు లైట్ మోటారు వెహికిల్ లైసెన్స్ కలిగిన ఎస్సీ అభ్యర్థులు నుంచి ఇటీవల దరఖాస్తులు కోరగా 32 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో పది మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు వివరించారు. 32 రోజుల శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెవీ లైసెన్సుతో డ్రైవింగ్‌లో ఉపాధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ, డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, ఆర్టీసీ డిపో– 1 డీఎం అమరసింహుడు, పీఆర్‌ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


