మూడు పూరిళ్లు దగ్ధం
రణస్థలం: లావేరు మండలం బుడుమూరులో శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతైనట్లు రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందరరావు తెలిపారు. సమాచారం అందగానే సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేశారు. ముంత శ్రీరాము, ముంత గోపి, ముంత పైడిరాజులకు చెందిన మూడు పూరిళ్లు కాలిపోయాయి. సుమారు రూ.18 లక్షలు వరకు నష్టం వాటిల్లింది. 8తులాల బంగారం, ఇంటి సామగ్రి, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్, రేషన్ కార్డులు కాలిబూడిదయ్యాయి. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు వంట సామగ్రి, టార్పాలిన్లు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్‌కాస్ ప్రతినిధులు కె.సత్యనారాయణ, పి.చైతన్యకుమార్, పి.సుజాత, పి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


