క్రైమ్‌కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఏఎన్‌ఎం మృతి
కొత్తూరు: గొట్లభద్ర గ్రామం వద్ద కిమిడి–వారణాసి రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురిగాం పీహెచ్‌సీ పరిధిలో ని వెల్‌నెస్ సెంటర్‌లో ఆర్‌సీహెచ్ ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఆర్.మాలతిబాయి (52) మృతి చెందారు. ఈమె ఒడిశా రాష్ట్రం కాశీనగర్ నుంచి కడుము వెల్‌నెస్ సెంటర్‌కు విధులు నిర్వహించేందుకు స్కూటీపై వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ కె.కోటేశ్వరరావు కేసు నమోదు చేశా రు. మాలతిబాయికి భర్త, కుమారుడు ఉన్నారు. కురిగాం పీహెచ్‌సీ వైద్యాధికారి పెద్దిన ప్రసన్నకు మార్, ఏవో బుజ్జిబాబు ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
మత్స్యకారుడు మృతి
సంతబొమ్మాళి: నౌపడ పంచాయతీ సీతానగ రం గ్రామానికి చెందిన బచ్చల భీమారావు (55) అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి గురువారం మృతి చెందాడు. గ్రామంలో ముస ళ్లఖానా సమీపంలో చేపల వేట కోసం నీటి ప్రవాహానికి అడ్డంగా వల ఏర్పాటు చేశారు. కొంత సమయం తర్వాత వలను తీసే ప్రయ త్నం చేశారు. ఈ క్రమంలో భీమారావు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందా డు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్సై నారాయణస్వామి తెలిపారు. భీమారావుకు భార్య, పిల్లలు ఉన్నారు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
పలాస : కంబిరిగాం వరహాల గెడ్డలో ఇటీవల గల్లంతైన దానగొర గ్రామానికి సవర లావన్న (35) మృతదేహం గురువారం బ్రాహ్మణతర్లా వంతెన వద్ద లభ్యమయింది. ఇనుప పైపులైనుకు అడ్డుకొని మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి విషయాన్ని కాశీబుగ్గ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు వరద నీటిలో దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లావన్న స్వగ్రామం మెళియాపుట్టి మండలం దాసుపురం. దానగొర గ్రామానికి చెందిన అన్నమ్మతో వివాహం జరగడంతో ఇక్కడే ఉంటున్నాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్‌కార్నర్
క్రైమ్‌కార్నర్


