● ఆర్మీ జవానుకు కన్నీటి వీడ్కోలు
ఇండియన్ ఆర్మీ 18–ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన నాయక్ వెంపటాపు రాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలు గురువారం స్వగ్రామం భైరిలో సైనిక లాంఛనాల నడుమ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మాజీ సైనికు లు పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ సాయిప్రత్యూష, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.శైలజ, సువ్వారి ఈశ్వరరావు, జిల్లా ఎక్స్‌సర్వీస్‌మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరరావు,జనరల్ సెక్రటరీ పి. మురళీధరరావు, ఎస్.రామకృష్ణ, ఎం.సింహాచలం, డి.వాసుదేవరావు, బోర రాంబాబు, జి. రామారావు తదితరులు నివాళులర్పించారు.
–శ్రీకాకుళం రూరల్


