అంగన్‌వాడీ కార్యకర్తకు అస్వస్థత
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కొత్తపేట–2 అంగన్‌వాడీ కార్యకర్త దాట్ల నీలవేణి గురువారం అస్వస్థతకు గురై కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో చేరారు. పీఓ హైమావతి వేధింపులు తట్టుకోలేక అస్వస్థతకు గురైనట్లు ఆమె వాపోయారు. మేలో తనను విధుల నుంచి తొలగించారని, హైకోర్టును ఆశ్రయించడంతో అక్టోబర్‌లో విధుల్లోకి తీసుకున్నా రని చెప్పారు. గతంలో హైకోర్టులో వేసిన కేసుకు సంబంధిం విత్‌డ్రా అవుతున్నట్లు గురువారం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో లెటర్ అందజేయాలంటూ పీఓ ఫోన్ చేసి గట్టిగా మాట్లాడారని నీలవేణి పేర్కొన్నారు. ఇదే విషయమై కొద్ది రోజులుగా వేధిస్తున్నారని.. నీవు ఎలా విధులు నిర్వర్తిస్తావో చూస్తానంటూ బెదిరించారంటూ బాధితురాలు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సంఘ నాయకులు హనుమంతు ఈశ్వరరావు, దుంపల సుధ, తోటి కార్యకర్తలంతా ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఈ విషయమై కోటబొమ్మాళి ఐసీడీఎస్ పీఓ హైమావతి వద్ద ప్రస్తావించగా.. లెటర్ అందజేయాలని చెప్పాం తప్ప ఎటువంటి వేధింపులు చేయలేదని పేర్కొన్నారు.


