
ఆస్పత్రి వ్యవహారంపై డీసీహెచ్ విచారణ
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం గర్భిణి బంధువులు వైద్యునికి మధ్య జరిగిన వివాదంపై జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి కల్యాణ్ బాబు శనివారం విచారణ చేపట్టారు. గర్భిణితో పాటు సంబంధిత సీ్త్ర వైద్య నిపుణురాలితో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృషి మాట్లాడుతూ గర్భిణి తరఫున వచ్చిన కొందరు దూషిస్తూ మాట్లాడారని వీడియో చూపించారు. దీంతో డీసీహెచ్ స్పందిస్తూ ఇలా దూషిస్తూ మాట్లాడడం సరికాదన్నారు. రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతగా ఉండాలని సూచించారు. దీనిపై నివేదిక కలెక్టర్‌కు పంపుతున్నట్లు తెలిపారు.