బుడ్డేపుపేటలో కార్డన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

బుడ్డేపుపేటలో కార్డన్‌ సెర్చ్‌

Oct 8 2025 6:35 AM | Updated on Oct 8 2025 6:35 AM

బుడ్డ

బుడ్డేపుపేటలో కార్డన్‌ సెర్చ్‌

బుడ్డేపుపేటలో కార్డన్‌ సెర్చ్‌ బెల్టు షాపుపై పోలీసుల దాడి పేకాట శిబిరంపై దాడి మద్యం మత్తులో యువకుడి వీరంగం

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలోని బుడ్డేపుపేటలో రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తు లు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో ధ్రువీకరణ పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు.గ్రామంలో నాటుసారా, గుట్కా, గంజాయి వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించారు.

ఇచ్ఛాపురం రూరల్‌: గ్రామాల్లో అధిక ధరలకు మద్యం అమ్ముతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నవారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని రూరల్‌ ఎస్‌ఐ ఈ.శ్రీనివాస్‌ మంగళ వారం హెచ్చరించారు. మండలంలోని పాయి తారి గ్రామానికి చెందిన ఇండుగు భీమారావు తన ఇంట్లో బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు వచ్చి న సమాచారం మేరకు సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీనిలో భాగంగా మద్యం బాటిళ్లతో పాటు భీమారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

కంచిలి: మండలంలోని సిర్తలి గ్రామంలో కొత్త చెరువు గట్టుపై సోమవారం రాత్రి 11.30 గంట ల సమయంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. దీనిలో భాగంగా ఏడుగురిపై కేసులు నమోదు చేసి, వారి నుంచి రూ.41 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు మంగళవారం తెలియజేశారు.

నరసన్నపేట: మండలంలోని మాకివలసలో పేకాట శిబిరంపై నరసన్నపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నిఘా వేసి దాడి చేశామని, 16 మందిని అరెస్టు చేసి.. రూ.4,800లు సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. గ్రామాల్లో పేకాట ఆడితే ప్రజలు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మద్యం మత్తులో ఒక యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఫలితంగా జిల్లా న్యాయస్థానం మంగళవారం 45 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ట్రాఫిక్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం నగరంలోని దమ్మలవీధికి చెందిన తమిరి సాయి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తూ, పొట్టి శ్రీరాములు కూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీసుల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అక్కడే ఉన్న ఎస్‌ఐ సోమశేఖర్‌ నిలువరించినా వినకుండా రోడ్డుపైనే వీరంగం చేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రిమాండ్‌ నిమిత్తం కోర్టు ముందు హాజరుపర్చగా.. శ్రీకాకుళం సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ 45 రోజుల జైలు శిక్ష విధించారు. వెంటనే సాయిని అంపోలు జైలుకు ట్రాఫిక్‌ పోలీసులు తరలించారు.

బుడ్డేపుపేటలో కార్డన్‌ సెర్చ్‌ 1
1/1

బుడ్డేపుపేటలో కార్డన్‌ సెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement