
● జజ్జనకరి జాతర
కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో బుధవారం నిర్వహించిన శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. శోభాయాత్ర కొత్త పేట కూడలి నుంచి కోటబొమ్మాళి వరకు అంగరంగ వైభవంగా సాగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు విజయ ఢంకా మోగించి శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. పలు రకాల సంప్రదాయ నృత్యాలు అలరించాయి. విద్యుత్ వెలుగులతో కొత్తమ్మ తల్లి ఆలయం నేత్రపర్వంగా మెరిసింది. జిల్లా పోలీసుల సమన్వయంతో ప్రజల సహకారంతో కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా శాంతియుతంగా జరుగుతున్నాయని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
– టెక్కలి/ శ్రీకాకుళం క్రైమ్