
నరసన్నపేటలో ‘కన్యా కుమారి’
నరసన్నపేట: కన్యాకుమారి సినిమా హీరోయిన్ గీత్ షైనీ బుధవారం నరసన్నపేట మండలంలో పలు గ్రామాల్లో సందడి చేశారు. మడపాం, కోమర్తి, దేవాది తదితర గ్రామాల్లో తిరిగారు. స్థానికులతో మాట్లాడి కన్యాకుమారి సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గీత్ షైనీ మాట్లాడుతూ కన్యాకుమారి సినిమాలో నటించేందుకు అవకాశం రావడం, అదీ శ్రీకాకుళం ప్రాంతంలో తీయ డం సంతోషంగా ఉందన్నారు. సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉందన్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియోస్‌లో దేశ వ్యాప్తంగా మొదటి 10 సినిమాల్లో కన్యాకుమారి స్థానం పొందిందన్నారు. అలాగే ఆహాలో మొదటి 5 సినిమాల్లో ఫస్ట్ స్థానంలో నిలిచిందని ఆనందంగా చెప్పా రు. మడపాంలో అభయాంజనేయ విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. హీరోయిన్ తో పాటు డైరెక్టర్ సృజన్ అట్టాడ కూడా ఉన్నారు.