
రైలు నుంచి దిగిపోయిన చిన్నారి
శ్రీకాకుళం అర్బన్: పలాస రెల్వేస్టేషన్‌లో తల్లిదండ్రులు, బంధువులు లేకుండా తిరుగుతున్న ఓ చిన్నారిని రైల్వే అధికారులు గుర్తించి శ్రీకాకుళంలోని అరసవల్లిలోగల శిశుగృహానికి తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ నుంచి పలాస రైల్వేస్టేషన్‌లో ఒక బాలుడు (వయసు సుమారు 3 సంవత్సరాలు) ఒంటరిగా దిగిపోయాడు. ఈ విషయాన్ని ప్రయాణికులు 139 నంబరు ద్వారా సమాచారం ఇవ్వగా, అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది బాలుడిని చైల్డ్ హెల్ప్‌లైన్‌కి అప్పగించారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల గురించి విచా రించినా ఎవరూ ముందుకు రాలేదు. తప్పిపోయిన బాలుడికి ఏం అడుగుతున్నా చెప్పలేకపోవడంతో ఆ బాలుని వివరాలు అందుబాటులోకి రాలేదు. అనంతరం బాలల సంక్షేమ సమితి ఆదేశాల మేరకు చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది ఆ చిన్నారిని శ్రీకాకుళంలోని అరసవల్లి శిశుగృహలో చేర్పించారు. బాలుడికి సంబంధించి తల్లిదండ్రులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, శ్రీకాకుళంను సంప్రదించాలని అధికారులు కోరారు.
ఉద్దానం పథకం పైప్‌లైన్ లీక్
కంచిలి: ఉద్దానం పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న నీరు నిత్యం ఏదోచోట వృథా అవుతూనే ఉంది. కంచిలి పంచాయతీ పరిఽధి మఠం కంచిలి నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న పైప్‌లైన్ రెండు రోజుల నుంచి లీక్ అవుతోంది. శనివారం పెద్ద ఎత్తున నీరు లీక్ కావడంతో స్థానికులు ఫిర్యా దు చేయడంతో, పైన వాల్వ్ బంద్ చేశారు. మళ్లీ ఆదివారం నీరు విడిచిపెట్టడంతో మధ్యా హ్నం నుంచి సాయంత్రం వరకు అదే భాగంలో నీరు పెద్ద ఎత్తున వృఽథా అవుతూ కన్పించింది. దీంతో మళ్లీ పంచాయతీ కార్యదర్శి ఎన్ని రాంబాబు దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన ఉద్దానం నీటి పథకం అధికారులకు తెలియజేయడంతో, మళ్లీ వాల్వ్ బంద్ చేశారు. మరమ్మతులు చేయకుండా నేరుగా వాల్వ్ బంద్ చేసి, నీటి సరఫరాను ఆపేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైలు నుంచి దిగిపోయిన చిన్నారి