
నిబంధనలు కాలరాసి..
పౌర సేవకు కేరాఫ్‌గా ఉండాల్సిన సచివాలయం బెదిరింపులకు నిలయమవుతోంది. సచివాలయం జారీ చేసిన ధ్రువీకరణ పత్రంపై ఆరోపణలు రావడం, ఉద్యోగికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం వంటివి సచివాలయ వ్యవస్థలో కొత్త లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. ఇప్పుడీ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. జలుమూరు మండలం జోనంకి సచివాలయం ఈ వివాదానికి వేదికై ంది.
జలుమూరు: జోనంకి సచివాలయంలో నిబంధనలకు విరుద్ధంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసి న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోనంకి పంచాయతీకి చెందిన ధవళ అప్పలనాయుడు మే 22న విశాఖలో అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆస్పత్రి లో మృతి చెందారు. కానీ స్థానికంగా జోనంకిలో మృతి చెందినట్లు కార్యదర్శి గుడ్ల సరోజిని డిజిటల్ సైన్‌తో మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అయితే సరోజిని ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సెలవులో ఉన్నారు. ఇదే సమయంలో లింగాలవలస సచివాలయం కార్యదర్శి ఎం.లక్ష్మి జోనంకి పంచాయతీకి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఈమె అప్పలనాయుడు మరణ ధ్రువీకరణ పత్రం సరోజిని డిజిటల్ సైన్‌తో మంజూరు చేశారు. దీంతో వి వాదం మొదలైంది. స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ మంజూరు చేశారని స్థానికులు చెబుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్ హరి ఈ పత్రానికి సంబంధించి ఫార్‌ం–2ను అప్‌లోడ్ చేసి సిస్టమ్ ద్వారా అందించారు. అయితే సెలవులో ఉన్న కార్యదర్శి పేరిట ధ్రువీకరణ పత్రం ఇవ్వకూ డదు. హరి మాట్లాడుతూ తనకు లింగాలవలస కా ర్యదర్శి అప్పల నాయుడు సర్టిఫికెట్‌కు సంబంధించిన ఓటీపీ చెబితే ఇచ్చానని, తనకు అంతవరకే తెలుసని వివరించారు. దీనిపై లింగావలస కార్యద ర్శి లక్ష్మీ మాట్లాడుతూ అదేం పెద్ద తప్పు కాదని, అప్పల నా యుడు స్థానికంగా మృతి చెందినట్లు వంద మంది సంతకాలు తన వద్ద ఉన్నాయని చెప్పడం విశేషం.
సైబర్ కమిషనర్ అంటూ రూ.1.20 లక్షలు వసూలు..
సెలవులో ఉన్న ఉద్యోగి పేరుతో పత్రం రిలీజ్ కావ డంతో ఓ అజ్ఞాత వ్యక్తి తాను సైబర్ కమిషనర్‌ను అంటూ కార్యదర్శి సరోజినికి ఫోన్ చేశాడు. ‘మీరు సైబర్ క్రైమ్‌లో ఇరుక్కున్నారు. మీ సంతకంతో లింగాలవలస కార్యదర్శి లక్ష్మి విశాఖలో మృతి చెందిన
వ్యక్తికి ఇక్కడ మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. మీ మీద పోలీసు కేసు నమోదవుతుంది. మీరు కోర్టులకు తిరగాల్సి వస్తుంది. త్వరలో అరెస్ట్ అవ్వనున్నా రు’ అని బెదిరించారు. దాదాపు నాలుగు గంటల పా టు ఇలా వేధింపులు రావడంతో ఆమె భయపడ్డారు. దీని నుంచి తప్పించుకోవాలంటే తమ ఫోన్‌కు పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని కార్యదర్శి సరోజినికి ఫోన్ రావడంతో ఆమె ఈ నెల 11న రూ.1.20 లక్షలు ఫోన్ పే చేశారు. అయినా మళ్లీ డబ్బు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఈ సోమవారం ఎస్పీ మహేశ్వర రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో జలుమూరు పోలీసులు కేసు ను ప్రత్యేకంగా దర్యాప్తు చేసి రూ.1.20 లక్షలు నగదు ఫోన్‌పే చేసిన ఫోన్‌ను హోల్డ్‌లో పెట్టిన ట్లు సమాచారం. ఇదే పంచాయతీలలో నాలుగేళ్ల కిందట ఏటీఎం మార్చి డబ్బు కొట్టేశారు. మళ్లీ ఇలా జరగడంతో స్థానికుల ప్రమేయం ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఏటీఎం మార్చి నగదును దొంగిలించిన వ్యక్తి ఒకరైతే మరో వ్యక్తిని అప్పట్లో పోలీసులు విచారించారు. దొంగలించిన వ్యక్తి తప్పు జరిగిందని అందులో కొంత నగదు తిరిగి ఇవ్వడంతో ఆ వివాదం సద్దు మణిగింది. ఈ అంశంపై సర్పంచ్ జీవీ రమణి మా ట్లాడుతూ తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ, కార్యదర్శి నుంచి డబ్బులు వసూలు వంటి అంశాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
జోనంకిలో నిబంధనలకు విరుద్ధంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ
టీడీపీ నాయకుల ఒత్తిడితోనే సర్టిఫికెట్
మంజూరు!
సెలవులో ఉన్న కార్యదర్శి డిజిటల్ సైన్‌తో పత్రం
అదే సాకుతో సైబర్ క్రైమ్ కమిషనర్‌ను అంటూ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు
ఆ వ్యక్తికి రూ.1.20 లక్షలు డిజిటల్ పేమెంట్ చేసిన కార్యదర్శి
అయినా ఆగని వేధింపులు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన కార్యదర్శి

నిబంధనలు కాలరాసి..

నిబంధనలు కాలరాసి..