
బ్రేక్..?
● ఇప్పటికే ఈహెచ్‌ఎస్ సేవలను
అనుమతించని పలు ఆస్పత్రులు
● ఎమర్జెన్సీ సేవలను మినహాయిస్తున్న నెట్‌వర్క్ ‘ఆశ’ ప్రతినిధులు
● ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను అనుమతించ
వద్దంటున్న 13 ఆస్పత్రుల యాజమాన్యాలు
● ఇప్పటికే రూ.140 కోట్ల వరకు పెరిగిన ప్రభుత్వ బకాయిలు
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు
కొనసాగుతున్నాయి..
జిల్లాలో 2024–25 వార్షికంలో మొత్తం 77,578 శస్త్రచికిత్సలను ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలో పూర్తి చేశాం. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నిలిపివేశారని వార్తలు వచ్చినప్పటికీ ఈ జిల్లాలో మాత్రం అనుమ తిస్తున్నారు. ఆంక్షలు అమల్లోకి వస్తే.. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతాం.
– డాక్టర్ ప్రకాశరావు, కోఆర్డినేటర్
ఆరోగ్యశ్రీ సేవలకు
అరసవల్లి:
పేదవాడికి ఇన్నాళ్లూ కొండంత అండగా నిలబడిన ఆరోగ్య శ్రీ కార్డు ఇప్పుడు చెల్లకుండా పోయే దశకు చేరుతోంది. లక్షలాది ప్రాణాలను కాపాడిన పథకం చిన్నచూపును ఎదుర్కొంటోంది. నిరుపేదల పాలిట సంజీవనిగా కీర్తినొందిన పథకాన్ని మె ల్లగా ఎత్తేసేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చడంతో పాటు ఈ పథకానికి నెట్ వర్క్ ఆస్పత్రులుగా ఉన్న యాజమాన్యాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ.4 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో పెట్టింది. దీనిపై ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ (ఆశ) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. కనీసం రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు తీర్చాలని, లేదంటే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభు త్వం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలిపివేసేలా నిర్ణయించా రు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం తదితర పలు ప్రధా న జిల్లాలో ప్రధాన ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. మరికొద్ది రోజుల్లో స్థానిక జిల్లాలోని ఉన్న 13 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసేలా చర్చలు మొదలుపెట్టారు. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) సేవలను కూడా నిలిపివేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలను కార్పోరేట్/ప్రైవేటు ఆస్పత్రులు నిలిపివేసేలా చర్యలకు దిగడం ఇది రెండోసారి. దీంతో వేలాది మంది రోగులకు ఆందోళన మొదలైంది. ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిపై మండిపడుతున్నారు.
బకాయి రూ.140 కోట్లు
జిల్లాలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 17 ప్రభు త్వ ఆస్పత్రులు, 13 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు నగదు రహిత వైద్య సేవలు అమలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆశా ప్రతినిధుల మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలను, ఈహెచ్‌ఎస్ సేవలను నిలిపివేసేలా అడుగులు వేస్తున్నారు. రోగుల ఎమర్జెన్సీ సేవలను మాత్రం అనుమతించేలా చర్యలకు దిగనున్నారు. ఇక ఈహెచ్‌ఎస్ కింద మాత్రం కేసులను అనుమతించకూడదన్నట్లుగా నిర్ణయించారు. వాస్తవానికి జిల్లాలో ఉన్న ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.140 కోట్ల వరకు బకా యిలు పెండింగ్‌లు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బకాయిలను చెల్లించకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉందన్న కారణంగా సాధారణ ఆరోగ్యశ్రీ కేసులను పూర్తిగా నిలిపివేసేలా చర్యలకు దిగుతున్నారు.
ఇదే ఏడాది జనవరిలో కూడా ఇలాగే ప్రభుత్వం తమ బకాయిలు తీర్చకపోవడంతో అప్పట్లో కొన్ని రోజులు ఆరోగ్యశ్రీ సేవలను, ఈహెచ్‌ఎస్ సేవలను కూడా నిలిపివేసిన సంగతి విదితమే. మళ్లీ ప్రభుత్వం బకాయిల చెల్లింపులో నిర్ల క్ష్యం కారణంగా మళ్లీ అలాంటి పరిస్థితులే పునరావృతం కానున్నాయి. సాధారణ ప్రొసీజర్లను కూడా పట్టించుకోవడంపై పలు కార్పొరేట్ ఆస్పత్రులు విముఖత చూపిస్తున్నారు. దీంతో రోగులపై ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి.

బ్రేక్..?

బ్రేక్..?