నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు

Sep 19 2025 2:52 AM | Updated on Sep 19 2025 2:52 AM

నేడు,

నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు

అరసవల్లి: తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విద్యుత్‌ ఉద్యోగ, కార్మిక సంఘా ఐక్యవేదిక (జేఏసీ) తమ నిరసనలను మ రింత ఉద్ధృతం చేసింది. ఈ మేరకు గురువారం భోజన విరామ సమయంలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికులంతా సర్కిల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర, శనివారాల్లో సర్కిల్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నట్లుగా ప్రకటించా రు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మహంతి ప్రభాకరరావు, రమేష్‌, టీవీ సుబ్రహ్మణ్యం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణలో ముందంజ

శ్రీకాకుళం: రాష్ట్రంలో ఎయిడ్స్‌ వ్యాధి పూర్తిగా నియంత్రణలోనే ఉందని రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ ప్రాజెక్టు సంచాలకులు కె. నీలకంఠ రెడ్డి తెలిపారు. 2010లో 4.1 శాతం ఉన్న వ్యాధి ప్రస్తుతానికి 0.5 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇకపై హెచ్‌ఐవీ రోగులకు ఒకే చోట అన్ని రకాల సేవలు అందించే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఏఆర్‌టీ కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్రంలో 2.75 లక్షల మంది ఎయిడ్స్‌ రోగులు ఉన్నారని, వీరందరికీ ఉచిత మందులు, పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు, త్వరలో 42 వేల కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మేరీ కేథరిన్‌, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ తాడే ల శ్రీకాంత్‌, రిమ్స్‌ డైరెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కాశీబుగ్గ డీఎస్పీకి వీఆర్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో కాశీబుగ్గ సబ్‌డివిజనల్‌ కేంద్రానికి డీఎస్పీగా వ్యవహరిస్తున్న వీవీ అప్పారావును మంగళగిరి డీజీపీ కార్యాలయానికి వీఆర్‌ అటాచ్‌ చేస్తూ గురువారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 2025 ఎన్నికల అనంతరం డీఎస్పీగా పాత్రిని శ్రీనివాసరావు కాశీబుగ్గ రావడం.. అక్కడికి కొద్ది నెలల్లోనే జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్‌)గా ఉద్యోగోన్నతి పొందడంతో అతని స్థానంలో బదిలీపై వీవీ అప్పారావు వచ్చారు.

30న దళిత సంఘాల జేఏసీ నిరసన

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని దళిత సంఘాల నేతలు అన్నారు. పాలకులు, అధికారుల తీరుకు నిరసనగా ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని ఆదివారంపేటలో జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయం వద్ద దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదని, బోధన సరిగ్గా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, ఇందుకు బా ధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరా రు. ఈ మేరకు గురువారం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా క న్వీనర్‌ దుర్గాసి గణేష్‌, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్‌, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అర్జీ ఈశ్వరరావు, అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు పాల్గొన్నారు.

నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు 1
1/2

నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు

నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు 2
2/2

నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement