
మరణమే చిన్నబోయేలా..
● జెమ్స్‌లో అవయవదానం
● చిరంజీవిగా మారిన సన్యాసినాయుడు
శ్రీకాకుళం రూరల్, జి.సిగడాం: జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం మరో అవయవదానం జరిగింది. జి.సిగ డాం మండలం, బాతువ గ్రామానికి చెందిన పోతిరెడ్డి సన్యాసిరావు నాలుగు రోజుల కిందట బ్రెయిన్‌స్ట్రోక్‌తో రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ మరోసారి స్ట్రోక్ రావడంతో మెరుగైన వైద్యం కోసం జెమ్స్ కు తరలించారు. చికిత్స అందిస్తున్నా సన్యాసిరావులో కదలికలు లేకపోవడంతో వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బ్రె యిన్ డెడ్ కావడంతో అవయవదానంపై అవగాహన కల్పించారు. మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు అతని అవయవా లు సజీవంగా ఉంటాయని వివరించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. జీవన్‌దాన్ విధానం ద్వారా లివర్, కిడ్నీలను సేకరించారు. ఇందులో ఒక కిడ్నీని జెమ్స్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విశాఖ లోని మెడికవర్‌కు వైద్యులు కేటాయించారు.

మరణమే చిన్నబోయేలా..