
సీటు కోసం ఫీట్లు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రతిరోజూ సాయంత్రం విద్యార్థుల కోలాహలం నెలకొంటోంది. నిత్యం సాయంత్రం పూట వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లేందుకు చేరుకుంటారు. అలా వస్తున్న విద్యార్థులు కాంప్లెక్స్‌లోకి వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం ఎగబడుతున్నారు. బస్సు ఎక్కేందుకు తీవ్రమైన తోపు లాట జరుగుతోంది. మరికొంతమంది విద్యార్థులు బస్సు కాంప్లెక్స్ ఇన్‌గేట్‌లోకి వచ్చిన వెంటనే అడ్డంగా పరుగులు తీయడం కనిపిస్తోంది. ఆర్టీసీ అధికారులు వారిస్తున్నా వినడం లేదు. ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.