
చదివింది ఎంబీఏ.. చేస్తున్నది దొంగతనం
● ఏటీఎం కార్డులను కొట్టేసి నగదు కాజేసిన ఘనుడి అరెస్టు
● జల్సాలకు అలవాటు పడి
దొంగతనాలు చేస్తున్న
ఎంబీఏ పట్టభద్రుడు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని పలు ఏటీఎం సెంటర్లలో నడి వయస్కులను, వృద్ధులను ఏమా ర్చి ఏటీఎం కార్డులను మార్చేసి నగ దు కొట్టేసిన ఘనుడిని ఎట్టకేలకు శ్రీకాకుళం సీసీఎస్ సీఐ ఎస్ సూర్యచంద్రమౌళి ఆధ్వర్యంలోని సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఐదు కేసుల్లో నిందితుడైన నరసన్నపేటకు చెందిన యువకుడు పేడాడ చిన్నబాబును ఆమదాలవలస ఎస్‌ఐ బాబూరావు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
రిటైర్డు హెడ్‌కానిస్టేబుల్‌ను ఏమార్చి..
ప్రస్తుతం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఏడీగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ పేడాడ ధర్మారావు సోదరుడు రామారావు కూడా రిటైర్డ్ హెడ్ కానిస్టేబులే. ఈయనది కొర్లకోట గ్రామం. రామారావు గత నెల 8న ఆమదాలవలస స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి ఏటీఎం సెంటరు లోపలికి డబ్బు లు తీసేందుకు ఉదయం 10 గంటలకు వెళ్లాడు. పిన్ నంబర్ కొడుతుండగా వెనుకగా ఉన్న చిన్నబాబు చూశాడు. కొంత సొమ్మును డ్రా చేసి లెక్కపెడుతుండగా చిన్నబాబు కావాలనే రామారావుకు తగలడంతో తన కార్డును జారవిడిచాడు. ఏమరపాటులో రామారావును మాటల్లో పెట్టిన చిన్నబా బు కార్డు అందుకున్నట్లు నటించి తన వద్దనున్న మరో ఎస్‌బీఐ ఏటీఎం కార్డును మార్చేశాడు. అక్కడికి కొద్ది గంటల్లోనే రూ. 40 వేలను మా యం చేశాడు. ఇదే తరహాలో అదే ఏటీఎం మిషన్ వద్ద కుదిరం గ్రామానికి చెందిన బస వ కృష్ణవేణి ఏటీఎం కార్డును మార్చి రూ. 30 వేలు నగదు కాజేశాడు. అంతకుముందే నరసన్నపేటలో రెండు, లావేరు పీఎ స్ పరిధిలో ఓ చోట చోరీలు చేశాడు.
విచారణలో దిగిన పోలీసులు..
ఆమదాలవలస సీఐ జె.సత్యనారాయ ణ పర్యవేక్షణలోని ఎస్‌ఐ బాబూరావు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను పరిశీలించాక నిందితుడిని పేడాడ చిన్నబాబుగా గుర్తించారు. విశాఖపట్నం పోలీసులకు వాంటెండ్ క్రిమినల్‌గా ఉన్న చినబాబు గతంలో 25 కేసుల్లో అరైస్టె రిమాండ్‌కు వెళ్లాడని తెలిసింది. ఎంబీఏ వరకు చదువుకున్న చిన్నబాబు సాంకేతికంగాను, చదువులోనూ తెలివైనవాడని, జల్సాలకు అలవాటు పడి గత పదేళ్లుగా దొంగతనాలు చేస్తూ లెక్కకు మించి కేసుల్లో నింది తుడై కటకటాల్లోకి వెళ్లినట్లు తెలుసుకున్నారు. సీసీఎస్ పోలీసులకు జిల్లా కేంద్రంలోనే అతడు దొరకగా ఆమదాలవలస స్టేషన్‌కు అప్పగించారు. నిందితు ని వద్ద నుంచి రూ.1.50 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.