
అచ్చెన్న అసమర్థత వల్లే ఎరువుల కొరత
● అచ్చెన్నాయుడు అసమర్థతను ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు
● ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: ౖరెతుల కష్టాలు తెలియని అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్రానికి పెద్ద దౌర్భాగ్యమని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. అచ్చెన్నాయుడు అసమర్థతను ఆ పార్టీ నా యకులే విమర్శిస్తున్నారని తెలిపారు. అదే విషయంపై వార్తలు రాస్తుంటే మీడియాపై అక్రమ కే సులు బనాయిస్తున్నారని తెలిపారు. సంతబొ మ్మాళి మండలం ఆకాశ లక్కవరంలో యూరియా కోసం రైతులు టీడీపీ నాయకులను నిలదీస్తే.. దాన్ని వ్యక్తిగత తగాదాలకు వక్రీకరించి వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సుగ్గు రామిరెడ్డిపై అక్రమంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అచ్చెన్నాయుడు చేతకానితనం అని తిలక్ మండిపడ్డారు. ‘సాక్షి’ దినపత్రికలు దహనం చేయడం అప్రజాస్వామ్యమన్నారు. రైతులకు చెందాల్సిన వ్యవసాయ యంత్రాల కొనుగోలులో అవినీతికి పాల్పడిన అచ్చెన్న రైతుల పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. రైతు సంక్షేమానికి పాటు పడిన వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్న అచ్చెన్నాయుడును పాతాళానికి పూడ్చి పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల్లో 25 శాతం సబ్సిడీ సుమారు రూ.1500 కోట్లు టీడీపీ ప్రభుత్వం ముందుగానే కొట్టేయడంతో ఎరువుల కొరత ఏర్పడిందన్నారు. టెక్కలిలో మంత్రి అనుచరులు ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ రూ.500 నుంచి రూ.600కు అమ్ముకుంటున్నారని, దీనిపై బహిరంగ చర్చకు అచ్చెన్నాయుడు సిద్ధమా అని సవాల్ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో లేని ఎరువుల కొరత ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని, గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని తిలక్ గుర్తు చేశారు. ఆ కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని తిలక్ దుయ్యబట్టారు.