
కొత్త పీఆర్సీ తక్షణం వేయాలి
● ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఏపీ ఎన్జీఓ సంఘం నిరంతరం పనిచేస్తోంది
● ఏపీ ఎన్‌జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్
శ్రీకాకుళం అర్బన్: సంఘం నిత్య చైతన్యంతో ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలమని ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్ అన్నా రు. ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆదివారం మొదటిసారి శ్రీకాకుళానికి ఏపీ ఎన్‌జీఓ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వచ్చారు. వీరికి జిల్లా సంఘ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇప్పటికీ సరిగ్గా అమలు కావ డం లేదని తెలిపారు. తక్షణం కొత్త పీఆర్పీ వేయా లని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు కూడా సరిగ్గా ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదని తెలిపారు. త్వరలో ఏపీఎన్జీఓ సంఘం తరఫున విజయవాడలో రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తామని, అందులో సంఘం విధులు–బాధ్యతలు వివరిస్తామని పేర్కొన్నారు. కొత్త కార్యవర్గాల్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఒకే డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తులకు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. బాధ్యతలు లేని రాష్ట్ర నాయకత్వాలు ఉండవని ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర కార్యదర్శి డీవీ రమణ అన్నారు. సంఘంలోని సభ్యులంతా ఏకతాటిపై నడిచి సభ్య త్వ నమోదు నుంచి కార్యవర్గ ఏర్పాటు వరకూ, అటుపై కార్యాచరణ వరకూ, కూర్పు నుంచి మా ర్పు వరకూ పనిచేయాలన్నారు. గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు స్ఫూర్తితోనే పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ సంఘ నాయకులు చౌ దరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయి రాం, ఆర్.వేణుగోపాల్, బడగల పూర్ణచంద్రరావు, కంఠ జయరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.