
వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
● పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం పంచాయతీలో గల దళితులు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరారు. మొత్తం 30 కుటుంబాలకు చెందిన 150 మందికి సత్యనారాయణ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. శ్రీకాకుళం నగరంలోని న్యూకాలనీలోగల కేవీజీ సత్యనారాయణ నివాసగృహానికి వచ్చి మరీ వారంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ కొంచాడ కృష్ణారావు మా ట్లాడుతూ టీడీపీలో గత 35 ఏళ్లుగా ఉన్నా తమను పట్టించుకున్నవారే లేరని, వైఎస్సార్‌సీపీలోనే తమ కు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో పార్టీలో చేరామన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ సంక్షేమ పథకాలు సైతం ఇవ్వకుండా వివక్ష చూపిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ గెలుపు కోసం కేవీజీ సత్యనారాయణతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా కేవీజీ సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ మీద ఉన్న నమ్మకంతో చేరిన వారికి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రాకోటి శ్రీనివాసరావు,బెలమాన వాసుదేవరావు, నక్క రామారావు, చింతాడ కృష్ణ, ముచ్చ ధనరాజ్, యాగాటి రవి, యాగాటి లక్ష్మి, కొంచాడ అప్పారావు, గుగ్గిల అశిరినాయుడు, బెలమాన గణేష్, మన్నేన పోలయ్య, మన్నేన పాపారావు, లింగాల శంకర్, బొంతల శంకరరావు, పైడి లక్ష్మన్నాయుడు, బగాది రామారావులో పాటు మరికొన్ని కుటుంబాలు చేరాయి. పార్టీలో చేరికలో గ్రామ ఉపసర్పంచ్ పైడి నర్శింహ అప్పారావు పాల్గొన్నారు.