తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

తిరుగుబాటు

Sep 12 2025 6:07 AM | Updated on Sep 12 2025 6:07 AM

తిరుగ

తిరుగుబాటు

వ్యవసాయ సిబ్బంది

నేను కిల్లాం మాకివలస రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ చూసేదాన్ని. చంద్రశేఖర్‌ అనే నాయకుడు డబ్బులు ఇవ్వకుండా 100 బస్తాలు దాచేయమని అన్నాడు. అప్పటికే రైతులు డబ్బులు, ఆధార్‌, ఇతర డాక్యుమెంట్స్‌ పట్టుకుని ఉన్నారు. వారిని కాకుండా 100 బస్తాలు ఎలా దాయగలను. ఆయన ల్యాండ్‌ డాక్యుమెంట్స్‌ చూపించలేదు. ఆధార్‌ ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకుండా కనీసం 60 బస్తాలైనా పక్కన పెట్టి ఇవ్వాలని అన్నారు. కానీ, నేను ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేకు చెప్పి నన్ను యారబాడుకు డిప్యుటేషన్‌పై వేసేశారు. నాకు చిన్న బాబు ఉన్నాడు. ఎంతో ఇబ్బందులు పడు తున్నాను. నాకు ఫోన్లు చేసి ఎంతో ఇబ్బంది పెట్టారు.

– లావణ్య, విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌

బూతులు

తిడుతున్నారు

రైతు సేవా కేంద్రం నాలెడ్జ్‌ సెంటర్‌గా అని పెట్టారు. ఇప్పుడది ఎరువుల కొట్టులా మారింది. మిగతా జిల్లాల్లో పీఏసీఏస్‌, డీసీఎంఎస్‌, గ్రోమోర్‌ వంటి సంస్థల ద్వారా విక్రయిస్తుంటే...ఇక్కడ మాచేత ఆ పనిచేయిస్తున్నారు. మమ్మల్ని కొందరు బూతులు తిడుతున్నారు. ప్రైవేటు డీలర్లు విక్రయిస్తున్న డేటా కూడా కలెక్ట్‌ చేసి ఇవ్వమంటున్నారు. దీని వల్ల మేము చేయాల్సిన పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఎప్పుడో చేయాల్సిన ఈక్రాప్‌ ఇప్పుడు చేయాల్సి వస్తోంది. ఇక, వీసీలు, ఇతరత్రా సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి ఉంది.

– జి.శరత్‌కుమార్‌, విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌.

జిల్లాలో ఎరువుల కొరత నిజమా.. కాదా..? నిల్వలు ఉన్నాయని నేతలు చెబుతున్న మాట వాస్తవమేనా..? వంటి ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక ఆందోళన సమాధానం చెప్పింది. జిల్లాలో ఎరువుల కొరత తీవ్రమన్న విషయం విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్ల ఆందోళనతో బట్ట బయలైపోయింది. ఓ వైపు ఎరువుల కొరత.. మరోవైపు నాయకుల వేధింపులతో విధి నిర్వహణ నరకంగా మారిందని వారంతా రాత్రిపూట కలెక్టర్‌ ముందు మొర పెట్టుకున్నారు. ఈ పని చేయడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెట్టారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

రువుల పంపిణీ నుంచి తమను తప్పించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు గురువారం కలెక్టరేట్‌ కార్యాలయా న్ని ముట్టడించారు. రాత్రిపూట కలెక్టర్‌ కార్యాల యం ముందు బైఠాయించి ధర్నా చేశారు. మేల్‌, ఫిమేల్‌ అసిస్టెంట్లు రాత్రి పది దాటినా ఆకలితో అక్కడే ఉండి తమ కష్టాలు చెబుతూ నినాదాలు చే శారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సొంత జిల్లాలో వ్యవసాయ శాఖకు చెందిన విలేజ్‌ అసిస్టెంట్ల తిరుగుబాటు సంచలనంగా మారింది.

ప్రభుత్వం సరిపడా ఎరువుల సరఫరా చేయనందున ఉద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని కోరినా పట్టించుకునే వారు లేరన్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని, సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. నిత్యం పోలీసుల బందోబస్తు ఇస్తున్నా భయంతోనే పనిచేస్తున్నామని, సిబ్బందిలో 50 శా తం మహిళలు ఉన్నారని, వారిలోనూ గర్భిణులు, బాలింతలు అధికంగా ఉన్నారని తెలిపారు. రాత్రి 10, 11గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టడం వల్ల మహిళా ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల నుంచి ఎరువుల అమ్మకం నగదును మార్కెఫెడ్‌ అధికారులు వసూలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 30లోపు ఖరీఫ్‌ ఈ–క్రాప్‌ నమోదు చేయాల్సి ఉందని, అత్యంత కీలకమైన ఈ సమయంలో ఎరువుల పంపిణీ, రికార్డుల నిర్వహణ బాధ్యతలు తలకు మించిన భారంగా మారాయని తెలిపారు. ఎరువుల పంపిణీ రియల్‌ టైమ్‌లో జరగాలంటే ఐఎఫ్‌ఎంఎస్‌ సేల్స్‌, డీబీటీ కోసం ఈపాస్‌ యంత్రాలను సరిపడా సరఫరా చేయాల్సి ఉన్నా చేయలేదన్నారు.

రైతు సేవా కేంద్రాల ఉద్యోగులకు ఎరువుల పంపిణీ మాత్రమే కాకుండా ఇతర విధులు కూడా ఉన్నాయని, ఎరువులు లేకపోవడం వల్ల ఇతర బాధ్యతలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఆలస్యానికి సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, గిరిజన సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయని, రబీలోనైనా మన జిల్లాలో అలా చేయాలన్నారు. సిబ్బంది ధర్నా అనంతరం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కొన్ని గంటల సేపు వారితో చర్చించారు. అంతకుముందు తన చాంబర్‌లో వినతి పత్రం తీసుకున్నారు. కలెక్టర్‌ ఎంత నచ్చ చెప్పినా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. రాత్రి 10గంటల దాటే వరకు ఆందోళన కొనసాగింది.

100 బస్తాలు

దాచేయమన్నాడు..

ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నామని నిరసన

గురువారం రాత్రి కలెక్టరేట్‌ ముట్టడి

ధర్నా చేసిన మేల్‌, ఫిమేల్‌ అసిస్టెంట్లు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు తమ సమస్యలు వివరిస్తున్న విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు

ఎరువులు

సరిపోవడం లేదు

జిల్లాలో విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్స్‌ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎరువుల పంపిణీకి రైతు సేవా కేంద్రాలకు ట్యాగ్‌ చేశారు. తక్కువ ఎరువుల సమయంలో 20, 30మంది రైతులు చుట్టుముట్టి, నానా దుర్భాషలాడుతున్నారు. భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నాం.

– తేజస్విని, విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌

తిరుగుబాటు 1
1/4

తిరుగుబాటు

తిరుగుబాటు 2
2/4

తిరుగుబాటు

తిరుగుబాటు 3
3/4

తిరుగుబాటు

తిరుగుబాటు 4
4/4

తిరుగుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement